Itlu Mee Niyojakavargam: జగ్గయ్యపేటలో పొలిటికల్ జగడం ముదిరిందా.. కక్షలు కార్పణ్యాలు కాదు ఇప్పుడంతా ప్రేమతో..

ఒకప్పుడు ఎన్నికలొస్తున్నాయంటే ఆ నియోజకవర్గంలో కక్షలు కార్పణ్యాలు బయటపదేవి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలంతా టెన్షన్ పడేవారు. కానీ మూడున్నరేళ్లుగా అక్కడ సీన్ మారింది.అక్కడి నేతల్లోనూ మార్పు వచ్చింది. పగతో కాదు మంచితనం తో జనాన్ని ఆకట్టుకోనే ప్రయత్నాలు ప్రారభించారు.రెండు ప్రధాన పార్టీల నేతలు సమ ఉజ్జీలుగా ఉన్న జగ్గయ్యపేట లో ఈసారి బరిలో నిలిచేదెవరు?

Itlu Mee Niyojakavargam: జగ్గయ్యపేటలో పొలిటికల్ జగడం ముదిరిందా.. కక్షలు కార్పణ్యాలు కాదు ఇప్పుడంతా ప్రేమతో..
Jaggayyapeta Assembly Constituency
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 27, 2023 | 7:40 PM

ఎన్ఠీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో రాజకీయాలు ఇక్కడి ఇతర నియోజకవర్గాల కంటే భిన్నంగా ఉంటాయి.ఇక్కడి ఓటర్లు పూర్తిగా ఒకవైపు మొగ్గు చూపిన సందర్భాలు చాలా అరుదు… ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే గా అధికార పార్టీ నుంచి ఉదయ భాను ఉన్నారు.గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసిన ఉదయ భాను…వైసీపీ స్థాపన నుంచీ జగన్ వెంట ఉన్నారు.2014 లో విడిపోయినా 2019 లో మాత్రం టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య పై గెలిచారు.ఒకప్పుడు నియోజకవర్గంలో దూకుడుగా ఉండే ఉదయభాను…మూడున్నరేళ్లుగా తన స్టైల్ర్ మార్చుకున్నారు.

వరుసగా రెండుసార్లు ఓడిపోవడం తో ఈసారి అందరినీ కలుపుకోలుపోతున్నారు భాను.అయితే ఉదయ భాను కు ఇక్కడ టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.గతంలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన శ్రీరామ్ తాతయ్య కు మరోసారి బరిలో నిలిచేందుకు కష్టాలు పడుతున్నారు.జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ తో సమానంగా టీడీపీ కూడా గట్టి పోటీ ఇచ్చి కేవలం ఒకే ఒక్క సీటు తేడాతో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోలేకపోయింది.అప్పటి నుంచి రెండు పార్టీలు నేతలు కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటున్నారు.

దీంతో ఇక్కడ ఫైట్ నువ్వా-నేనా అన్నట్లే ఉంటుంది..అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ భాను కుప్రతిపక్షం కంటే సొంత పార్టీలోనే తలనొప్పి ఎక్కువగా ఉంది.ఇక్కడ వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యే పై గుర్రుగా ఉన్నారు.సొంత ప్రయోజనాల కోసం పార్టీపై విమర్శలు కూడా చేస్తున్నారు.ఇటీవల మున్సిపల్ కో ఆప్షన్ పదవికి రాజీనామా చేసిన జగదీష్….ఉదయ భాను పై విమర్శలు గుప్పించారు.

చివరికి సొంత పార్టీలోనే కొనసాగుతానని ప్రకటన చేశారు.నిన్న మొన్నటి వరకూ ఉదయభాను తో కలిసి తిరిగిన నాయకులు కొంతమంది ఇపుడు భాను ఓటమికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలాంటివి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఉదయ భాను.తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల మళ్లీ తానే గెలుస్తా అంటున్నారు.

టీడీపీ వారికి కూడా ఎలాంటి సమస్య ఉన్నా….అన్నీ తానై పరిష్కారించడం తనకు కలిసిచ్చే అంశం అంటున్నారు నియోజకవర్గంలో ఇటీవల రోడ్ల విస్తరణ తో పాటు సుమారు 25 కోట్లతో పకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఉదయభాను చెప్తున్నారు.భాను తో పాటు తన కుమారుడు ప్రసాద్ కూడా స్థానిక కౌన్సెల్లర్ గా ఉంది ప్రజలతో మమేకం కావడం…సమస్యల పరిష్కారం లో ముందుడటం కూడా సామినేని కి కలిసొచ్చే అంశం.తండ్రితో పాటు కుమారుడు కూడా వైసీపీ తరపున నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.

సామినేని ఉదయ భాను కు ఇక్కడ అసలైన ప్రత్యర్థి శ్రీరామ్ తాతయ్య.టీడీపీలో మంచి కేడర్ ఉన్న నాయకుడు..ఉదయ భానుపై నేరుగా ఎలాంటి విమర్శలు చేయకున్నా….పార్టీ గెలుపు కోసం అధిష్టానం అదేశలతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి చేరువగా ఉంటున్నారు.ఒకప్పుడు ఉదయభాను తో కలిసి కాంగ్రెసు లో పనిచేసిన తాతయ్య….టీడీపీ లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే కావడం తో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.సౌమ్యుడిగా పేరున్న తాతయ్య కు అధిష్టానం అండ కూడా పూర్తిగా ఉంది.పైగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ ఇక్కడ బలంగా ఉందని చెప్తున్నారు.

గత ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి ఇచ్జిన హమీ లు నెరవేర్చకపోవడం,చంద్రబాబు పై ప్రజల్లో వస్తున్న ఆదరణతో ఈసారి జగ్గయ్యపేట లో నిలిచేది టీడీపీ అంటున్నారు.నేరుగా ఉద‌య‌భానుపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా….నియోజ‌కవ‌ర్గం అభివృద్దిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎమ్మెల్యేపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.మాజీ మంత్రి నెట్టెం రఘురాం కూడా తాతయ్య కు పూర్తి అండగా నిలవడం,సామాజిక వర్గాల ఓట్లకు గేలం వేయడం ద్వారా టీడీపీ గెలుపు తధ్యం అనే నమ్మకంతో ఉన్నారు.

నియోజకవర్గం లో మొత్తం లక్షా 96 వేల మంది ఓటర్లు ఉన్నారు బీసీలు 55 వేలు,ఎస్సీ ల ఓట్లు 55 వేలు ఉన్నాయి.కమ్మ సామాజికవర్గం ఓట్లు 30 వేలు,కాపులు,యాదవులు కలిపి 19 వేలు,వైశ్యుల‌ ఓట్లు 9 వేలు ఉన్నాయి….అయితే ఇక్కడ కమ్మ సామాజికవర్గం ప్రభావం వోటింగ్ పై ఎక్కువగా ఉంటుంది….2004 వరకూ ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి నేతలు బరిలో ఉండేవారు…ఆ తరవాత కాపు,వైశ్య అభ్యర్థులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు…అయితే ఎమ్మెల్యే గెలుపుని నిర్న‌యించేది మాత్రం జగ్గయ్యపేట పట్టణం.ఇక్క‌డే 50వేల ఓట్లు ఉన్నాయి.

ఇక్కడి ఓటర్లే గెలుపు ఓటములు నిర్ణయిస్తారు…2009,2014 లో టీడీపీ నుంచి శ్రీరామ్ తాతయ్య గెలుపుకు కారణం కూడా ఇక్కడ వచ్చిన మెజారిటీనే.2019 లో ఉదయ భాను కూడా మిగిలిన మండలా ల్లో తక్కువ ఓట్లు పొందినా జగ్గయ్యపేట టౌన్ లో అధిక ఓట్లు రావడంతో ఎమ్మెల్యే గా గెలుపొందారు.ఈసారి కమ్మ సామాజిక వర్గం నుంచి నెట్టెం రఘురాం ద్వారా ఓట్లు సాదించుకుని….సొంత సామాజిక‌వ‌ర్గ‌మైన వైశ్య కులం ఓట్ల‌తో అధిక ఓట్లు సాదించుకుని బరిలో నిలబడేలా శ్రీరామ్ తాతయ్య కసరత్తు చేస్తున్నారు..

ప్ర‌తి ఎన్నిక‌ల్లో జ‌గ్గ‌య్య‌పేట‌లో ఆర్ధికంగా బ‌లంగా ఉన్న వైశ్య కులం నుంచి కూడా మ‌ద్ద‌తు ఉంటుంది.అయితే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు,మూడున్నరేళ్లలో ఉదయ భాను చేసిన అభివృద్ధితో ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.ఇక్కడి ఓటర్లు సైతం మళ్లీ భానుకి మా ఓటు అంటున్నారు.

ఇక నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారం లో ఎమ్మెల్యే ఉదయభాను కాస్త వెనుకపడ్డారు..ప్రధానంగా జగ్గయ్యపేట ను అనుకుని ఉన్న ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా లో విపరీతమైన కాలుష్యం ద్వారా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఐటీవల కాలుష్యం భరించలేక స్థానికులు,విద్యార్ఫులు సైతం రోడ్డెక్కారు.కొన్ని ఫార్మా కంపెనీల విష వ్యర్థాలతో భూగర్భ జలాలు విషమయంగా మారాయి.

జగ్గయ్యపేట లోని కొన్ని ప్రాంతాలలో పాటు షేర్ మహమ్మద్ పేట లోని కుళాయిలు నుంచి ఆసిడ్ నీళ్లు వస్తున్నాయంటే ఇక్కడి పరిస్థితి అర్థం అవుతుంది.కాలుష్యం నివారణ కోసం పెద్ద ఎత్తున చెట్ల పంపకం చేపట్టారు.కొన్ని ఫార్మా కంపెనీల ను తరలిపోవలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.దీంతో ఇక్కడి గ్రామాల జనానికి విషపు నీళ్ళే డిక్కవుతున్నాయి.

నియోజకవర్గం లో మరో ప్రధానమైన సమస్య లింగాల బ్రిడ్జి…ఎప్పుడో 1950 లో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడం, వర్షా కాలంలో మున్నేరు పొంగి ప్రవహిస్తుండటంతో ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి.

లింగాల బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీలు ఇచ్చినా నెరవేర్చడం లేదని స్థానికులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎనిమిదో పెద్ద దేవాలయం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం కూడా ఈనియోజకవర్గం లోనే ఉంది.ఇక్కడ నిత్యం ట్రాఫిక్ కష్టాలు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

మరోవైపు ఎన్నికల్లో గెలవడానికి ముందు ఉదయభాను ఇచ్చిన హమీలు ఇప్పటికీ కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి.టిడ్కో ఇల్లు,లింగాల బ్రిడ్జి,గరికపాడు కేవీకే లో యూనివర్సిటీ ఏర్పాటు,ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు నెరవేర్చలేదు.దీంతో పాటు జగ్గయ్యపేట నుంచి విజయవాడ వరకూ సుమారు 100 కిలోమీటర్లు వరకూ ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం తో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోతున్నారు…ఈ హామీలన్నీ ఇప్పటికీ నెరవేర్చకపోవడం ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది.మొత్తానికి రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు గట్టిగా ఉన్నప్పటికీ టీడీపీలో ఉన్న గ్రూపు తగాదాలు వైసీపీకి కలిసొస్తాయని ఆశతో ఉన్నారు ఎమ్మెల్యే ఉదయ భాను.మరి పేట ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారనేది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ఈ టిప్స్‎తో మీ కుంభమేళా జర్నీ సేఫ్ అండ్​ హ్యాపీ​!
ఈ టిప్స్‎తో మీ కుంభమేళా జర్నీ సేఫ్ అండ్​ హ్యాపీ​!
అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
అమ్మకాల్లో జనఔషధి అవుట్‌లెట్‌ల రికార్డు..!
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
ఈ గ్రామంలో ఎవరికీ పేర్లు లేవు.. ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారంటే
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే