AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రిని పట్టించుకోని కొడుకులకు కోర్టు షాక్.. అదిరిపోయే తీర్పు ఇదే!

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కుమారులకు కోర్టు గుణపాఠం చెప్పింది. కడప జిల్లాకు చెందిన 88 ఏళ్ల వృద్ధుడు తన ఆస్తిని కొడుకులకు రాసివ్వగా, వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, కుమారుల పేరిట ఉన్న ఆస్తి హక్కులను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సీనియర్ సిటిజన్ల ఆస్తి హక్కుల పరిరక్షణకు ఇది ఒక మంచి ఉదాహరణ.

తండ్రిని పట్టించుకోని కొడుకులకు కోర్టు షాక్.. అదిరిపోయే తీర్పు ఇదే!
Parental neglect
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 6:06 PM

Share

ఇటీవల కాలంలో చాలా మంది తమ తల్లిదండ్రులను పోషించడాన్ని పెద్ద భారంగా ఫీల్ అవుతున్నారు. వారు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి. కానీ వారిని పోషించడం మాత్రం కష్టంగా భావిస్తున్నారు. సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఇద్దరు కుమారులు పేరున రాసిన ఒక తండ్రి.. వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరానికి చెందిన 88 సంవత్సరాల వృద్ధుడు బండి ఆత్మకూరు రామిరెడ్డికి చెందిన ఆస్తి హక్కులను పునరుద్ధరిస్తూ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రామిరెడ్డి తన ఆస్తిని ఇద్దరు కుమారులకు రాసిచ్చాడు. కానీ, కుమారులు తండ్రిని పట్టించుకోకపోవడంతో సీనియర్ సిటిజన్ అయిన భాదితుడు కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు ట్రిబ్యునల్.. కుమారుల పేరున ఉన్న ఆస్తి హక్కులను రద్దు చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఆ ఇద్దరి కొడుకుల తిక్క కుదిరింది. ఆస్తి కోసం బాగున్నారే తప్ప కన్నతండ్రిని చూసుకోవాలన్న కనీస జ్ఞానం లేకుండా పోయింది. ఆ ఇద్దరు కొడుకులకు. ఆస్తి అయితే కావాలి గానీ ఆయన మాత్రం వద్దంటూ తండ్రిని సరిగా చూసుకోకపోవడంతో కోర్టు వారికి సరైన గుణపాఠం చెప్పినట్లయింది.

Follow Us