Araku Valley: త్వరలో ఆంధ్రా ఊటీలో పారా గ్లైడింగ్.. గాల్లో తేలినట్టుందే..అంటూ..!

| Edited By: Surya Kala

Sep 30, 2024 | 4:13 PM

అరకులోయలో పర్యాటకులను ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నారు ఐటిడిఏ అధికారులు. అడ్వెంచర్ టూరిజంను పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పాడేరుకు చెందిన సంతోష్ అనే యువకుడు పారా మోటార్ రైడింగ్, ఈగల్ ఫ్లం కి అనుమతి పొందాడు. అరకులోయ సమీపంలో పారా గ్లైడింగ్ చేసేందుకు వీలుగా అనుమైన ప్రాంతాలను పరిశీలించారు ఐటీడీఏ పీవో అభిషేక్. కొండల నడుమ సుందర ప్రదేశాలు చూస్తూ పారాగ్ రైడింగ్ చేసే అవకాశాలని పరిశీలిస్తున్నారు.

Araku Valley: త్వరలో ఆంధ్రా ఊటీలో పారా గ్లైడింగ్.. గాల్లో తేలినట్టుందే..అంటూ..!
Paramotor Ride In Araku
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని ఒక పర్యాటక సుందర ప్రదేశం అరకులోయ ఏజెన్సీ.. ఇక్కడి ప్రకృతి అందాలు అందర్నీ కట్టిపడేస్తుంటాయి. ఆంధ్రా ఊటీగా ఖ్యాతిగాంచింది ఈ ప్రదేశం. ఇక్కడ సుందర దృశ్యాలు చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పదేపదే వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రకృతి సోయగలను ఆస్వాదిస్తూ ఉంటారు. కేవలం ఇక్కడ ప్రకృతి అందలే కాదు.. అడ్వెంచర్ స్పోర్ట్స్ కు కూడా అనుకూల ప్రాంతాలు ఇక్కడ చాలానే ఉన్నాయి.. అందుకే వీటిని పర్యాటకులకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. అందుకు అనువైన ప్రాంతాలను పరిశీలించారు. త్వరలో గాల్లో తేలినట్టుందే అని పర్యాటకులు ఎంజాయ్ చేస్తారని అంటున్నారు స్థానికులు.

అరకులోయలో పర్యాటకులను ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకు వేస్తున్నారు ఐటిడిఏ అధికారులు. అడ్వెంచర్ టూరిజంను పరిచయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పాడేరుకు చెందిన సంతోష్ అనే యువకుడు పారా మోటార్ రైడింగ్, ఈగల్ ఫ్లం కి అనుమతి పొందాడు. అరకులోయ సమీపంలో పారా గ్లైడింగ్ చేసేందుకు వీలుగా అనుమైన ప్రాంతాలను పరిశీలించారు ఐటీడీఏ పీవో అభిషేక్. కొండల నడుమ సుందర ప్రదేశాలు చూస్తూ పారాగ్ రైడింగ్ చేసే అవకాశాలని పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇందులో భాగంగా అరకు వ్యాలీ సమీపంలోని జైపూర్ జంక్షన్ వద్ద ప్రాంతాన్ని పరిశీలించారు. గాలి వాటం ఫ్లయింగ్ ల్యాండింగ్ కు అనువైన ప్రాంతాలుగా మాడగడ వ్యూ పాయింట్, జైపూర్ జంక్షన్ లను గుర్తించారు. విజయవంతంగా ట్రైల్ రన్ చేశారు. స్వయంగా పారా మోటరింగ్ లో పిఓ అభిషేక్ పాల్గొని గాల్లో చక్కర్లు కొట్టారు. త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..