AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
పల్నాడు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. కార్మికులు, విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి అమ్ముతున్న నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. గంజాయి రవాణాపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. గంజాయి రవాణా కొత్త ఫుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కాలేజీ, స్కూలు విద్యార్థులే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. గంజాయి చాకెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. గంజాయి చాకెట్లకు విద్యార్థులు బానిసలను చేస్తున్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక చోట మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో భారీగా గంజాయి, గంజాయి చాకెట్లు కలకలం రేపాయి. నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రం పూరికి చెందిన వ్యక్తిని పట్టుకున్నారు పల్నాడు జిల్లా పోలీసులు.
ఆయుర్వేద చాకెట్ల పేరుతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఒడిశాకు చెందిన ఉదయానంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గంజాయి విక్రయాలపై ఆరా తీస్తున్నారు. అతని దగ్గర నుంచి 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కార్మికులు, విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి ఎక్కడెక్కడికి సరఫరా చేశారు?. ఇప్పటి వరకూ ఎంత సరుకు అమ్మారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..