- Telugu News Photo Gallery Technology photos IPhone 17 leaked features and photos, Click here for full details
iPhone 17: ఐఫోన్ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్..
యాపిల్ బ్రాండ్‌లో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఏటా ఐఫోన్ కొత్త వేరియంట్‌ను తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఐఫోన్ 16ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఐఫోన్ కొత్త సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 17ని 2025 సెప్టెంబర్‌లో తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు అప్పుడే బయటకు వచ్చాయి..
Updated on: Dec 02, 2024 | 9:53 PM

నెట్టింట వైరల్ అవుతోన్న వివరాల ప్రకారం ఐఫోన్ 17 ప్రోలో అల్యూమినియం ఫ్రేమ్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, 16ప్రోలో టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇక కెమెరా బంప్‌ను సైతం అల్యూమినియంతో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన మోడల్స్‌తో ఇది భిన్నంగా ఉండనుంది.

ఇక ఐఫోన్ 17 ప్రోలో ఆపిల్ కంపెనీకి చెందిన కొత్త A19 ప్రో చిప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ TSMC 3nm టెక్నాలజీపై ఆధారపడి ఉంటుందని సమాచారం. దీంతో ఫోన్ మరింత వేగంగా పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఈ ఫోన్‌లో 128 జీబీ వరకు ర్యామ్‌ను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్లకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు తెఉలస్తోంది.

కెమెరా విషయంలో కూడా కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మూడు కెమెరాలు ఒకదాని పక్కన ఒకటి లైన్‌గా ఉండేలా అవకాశం ఉన్నట్లు కొన్ని ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. టెలిఫొటో కెమెరాను 48 ఎంపీకి అప్‌గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్‌లో డైనమిక్ ఐలాండ్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇది స్క్రీన్-టు-బాడీ రేషియోను మరింత మెరుగుపరుస్తుంది. ఇందుకోసం యాపిల్ Meta Lens of Face ID సిస్టమ్‌ని ఉపయోగిస్తోందని సమాచారం. మరి వీటిలో నిజానిజాలేంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.





























