Andhra Pradesh: మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నోటిఫికేసన్‌.. అమల్లోకి కొత్త నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో అమలవుతోన్న మద్యం చట్టాలపై కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మద్యం విక్రయాల్లో జరుగుతోన్న అవకతవకాలను నియంత్రించేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది..

Andhra Pradesh: మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నోటిఫికేసన్‌.. అమల్లోకి కొత్త నిబంధనలు
Andhra Pradesh
Follow us
Eswar Chennupalli

| Edited By: Narender Vaitla

Updated on: Dec 02, 2024 | 8:43 PM

ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయాల్లో అవకతవకలను నియంత్రించేందుకు ఈ నోటిఫికేషన్ లో కఠిన చర్యలను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మద్యం దుకాణాలు మరియు బార్ లైసెన్సులకు కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వం. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడం పూర్తిగా నిషేధించబడ్డట్టు ప్రకటించిన ప్రభుత్వం మొదటిసారి ఇలా చేస్తే రూ. 5 లక్షల భారీ జరిమానా విధించబడుతుందనీ నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. అదే తప్పు మళ్లీ చేస్తే దుకాణం లేదా బార్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపుల నిర్వహణ కూడా పూర్తిగా నిషేధించబడింది. బెల్ట్ షాపులను నిర్వహిస్తే మొదటిసారి జరిమానా విధించగా, రెండోసారి మాత్రం ఆ దుకాణం లైసెన్సు రద్దు చేస్తారు. ఈ నిబంధనలు మద్యం దుకాణాలకే కాకుండా బార్ లైసెన్సులకూ వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) కింద తీసుకోబడుతున్నాయి. ప్రజలకు న్యాయమైన ధరల వద్ద మద్యం అందుబాటు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపింది.

ప్రభుత్వం ఈ నిర్ణయాలను అమలు చేయడం ద్వారా మద్యం విక్రయ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది. మద్యం వ్యాపారులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా తమ లైసెన్సులను రక్షించుకోవాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించేవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది.

నోటిఫికేషన్ లో పేర్కొన్న అంశాలివే..

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే మొదటి సారి చేసిన తప్పుకు ₹5 లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక బెల్ట్ షాపుల నిర్వహణ విషయానికొస్తే.. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ₹5 లక్షల జరిమానా, అదే తప్పు మరోసారి చేస్తే లైసెన్స్‌ రద్దు చేస్తారు. ఈ నిబంధనలు బార్ లైసెన్సులకూ కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మద్యం విక్రయం నియంత్రణ, అక్రమాలు, బెల్ట్ షాపుల మీద నిఘా ప్రజలకు న్యాయమైన ధరలకు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడం. నిబంధనలను పాటించడం ద్వారా వ్యాపారులు తమ లైసెన్సులను కాపాడుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నొటిఫికేసన్‌.. కొత్త నిబంధనలు
మద్యం చట్టాలపై ప్రభుత్వం కొత్త నొటిఫికేసన్‌.. కొత్త నిబంధనలు
తలస్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు..!
తలస్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు..!
నాగ చైతన్య- శోభితల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
నాగ చైతన్య- శోభితల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. ఆ తర్వాత
మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. ఆ తర్వాత
ఈ మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి.. పూరి మ్యూజింగ్స్‌ లేటెస్ట్‌
ఈ మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి.. పూరి మ్యూజింగ్స్‌ లేటెస్ట్‌
పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా