Andhra Pradesh: ఆకట్టుకుంటున్న వరి కంకుల అలంకరణలు.. ఎలా చేశారో చూడండి
అన్నదాతలు పండించే ఆహార ఉత్పత్తుల్లో ధాన్యం మొదటి స్థానంలో ఉంటుంది. వరి పంట చేతికొచ్చిన సమయంలో గతంలో సంక్రాంతి పండుగ వచ్చేది. కాలక్రమంలో పంటల సాగులో కొన్ని మార్పులు వచ్చిన సాగుదారులకు పంట ఇంటికొచ్చిన రోజే పెద్ద పండుగ. గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో వరి విస్తారంగా పండిస్తారు. పంట కోతకొచ్చిన సమయంలో కొన్ని...
కొత్త పంట ఇంటికి వచ్చిందంటే రైతులకు ఎనలేని సంతోషం. పంట చేతికొచ్చిన రోజే పండుగ అనుకోవడం, సంబరంగా ఆ రోజును జరుపుకోవడం అన్నదాతలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. తాము పండించిన పంటను దేవదేవుళ్లకు నైవేద్యంగా సమర్పించే వారు కొందరైతే మరికొందరు ఆ పంటలతో తమ ఇంట్లో అలంకరణలు చేసుకునే వారు మరొకొందరు. అయితే ఎప్పుడైతే ప్లాస్టిక్ వస్తువుల తయారీ మార్కెట్‌ను ముంచెత్తిందో అప్పటి నుంచి పంటలను ఇళ్ల అలంకరణగా వాడుకునే అలవాటు తప్పింది. ప్రస్తుతం రైతులు మాత్రం వ్యవసాయ ఉత్పత్తులను తమ ఇళ్ల అలంకరణ కోసం ఉపయోగించుకుంటున్నారు.
అన్నదాతలు పండించే ఆహార ఉత్పత్తుల్లో ధాన్యం మొదటి స్థానంలో ఉంటుంది. వరి పంట చేతికొచ్చిన సమయంలో గతంలో సంక్రాంతి పండుగ వచ్చేది. కాలక్రమంలో పంటల సాగులో కొన్ని మార్పులు వచ్చిన సాగుదారులకు పంట ఇంటికొచ్చిన రోజే పెద్ద పండుగ. గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో వరి విస్తారంగా పండిస్తారు. పంట కోతకొచ్చిన సమయంలో కొన్ని వరి కంకులను విరిచి వాటితో ఇంటి గుమ్మాలను అలంకరణ చేస్తుంటారు. గతంలో ఈ పద్దతి విరివిగా ఉండేది. అయితే గత కొంతకాలంగా ఈ అలవాటును రైతులు మర్చిపోయారు. ప్లాస్టిక్ వస్తువులు ఇంటిని ముంచెత్తుతున్న తరుణంలో వరి కంకులతో అలంకరణ అనేది లేకుండా పోయింది.
తిరిగి వరి కంకులతో అలంకరణ చేయడం మళ్లీ మొదలైంది. కొల్లిపర మండలంలోని రైతులు కొత్త వరి కంకులతో వివిధ అలంకరణలు చేస్తున్నారు. తుమూలూరుకు చెందిన సుజాత అనే మహిళ తన పంట చేతికొచ్చిన సమయంలోనే కొత్త వరి కంకులతో వివిధ అలంకరణలు చేసి ఇంటి గుమ్మాలను అలంకరించారు. గతంలో అయితే ఇలా కంకులను కట్టడం వెనుక పక్షుల ఆహారంగా కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం ఉండేది. ప్రస్తుతం అలాంటి ఉద్దేశాలు లేకపోయిన తాము కష్టించి పండించే పంట ఇంటికొచ్చే సమయంలో ఈ విధంగా అలంకరణలు చేయడం సంతోషంగా ఉందని సుజాత తెలిపారు. ఎప్పుడో కనుమరుగై పోయిన సాంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చిన సుజాతను పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..