వాస్తు ప్రకారం ఇంట్లో గోడ గడియారాన్ని ఉంచడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంపద, మొత్తం శ్రేయస్సు పై దీని ప్రభావం చూపుతుంది.
TV9 Telugu
ఇంటి ఉత్తర దిక్కును సంపదల దేవుడు కుబేరుడు పరిపాలిస్తాడు. అందువల్ల, ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు.
TV9 Telugu
తూర్పు దిక్కును దేవతల రాజు ఇంద్రుడు పరిపాలిస్తాడు. తూర్పు దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల నివాసితుల ఆరోగ్యం , శ్రేయస్సు మెరుగుపడుతుందని చెబుతారు.
TV9 Telugu
తూర్పు దిశ ముఖ్యంగా బెడ్‌రూమ్‌లు, స్టడీ రూమ్‌లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యం, విద్యా విజయాన్ని ప్రోత్సహిస్తుంది.
TV9 Telugu
పశ్చిమ దిశ నీటి దేవుడైన వరుణదేవునితో ముడిపడి ఉంది. కాబట్టి, ఈ దిశలో గోడ గడియారాలను ఉంచటానికి అనువైనది చెబుతున్నారు.
TV9 Telugu
కానీ, పశ్చిమ దిశలో పని చేయని గడియారాలు ఉంచితే శాంతి, స్థిరత్వానికి విఘాతం కలిగిస్తాయి. కాబట్టి అవి సరిగ్గా పని చేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటం చాలా ముఖ్యం.
TV9 Telugu
వాల్ క్లాక్‌ని తూర్పు, పశ్చిమం, ఉత్తరం వైపున్న గోడకు వేలాడదీయవచ్చు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు గోడకు వేలాడదీయవద్దు అని వాస్తుశాస్త్రం చెబుతోంది.
TV9 Telugu
ఇంటి మెయిన్ ఎంట్రన్స్, ఎంట్రన్స్ డోర్‌కి వాల్ క్లాక్‌ని అస్సలు పెట్టొద్దు. అలా చేస్తే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. అనవసర వివాదాలు, కష్టాలు, నష్టాలు, నిత్య ఓటమి తప్పదు.