ఒంటి నొప్పులు సహజంగా తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో కొంత పసుపు వేసుకొని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఔషధ గుణాలు ఒంటి నొప్పులను బలదూర్ చేస్తాయి.
అల్లం కూడా ఒంటి నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో నొప్పి ఉన్న ప్రదేశంలో అల్లం రసాన్ని అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పితో పాటు వాపు కూడా దూరమవుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రతీ రోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక అల్లం ముక్కను చప్పరించాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవడంతో పాటు, ఒంటి నొప్పులు సైతం దూరమవుతాయి.
ఖర్జూర కూడా ఒంటి నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గోరు వెచ్చని నీటిలో నానబెట్టి ఖర్జూరను తీసుకోవాలి. అలాగే ఆ నీటిని తాగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కీళ్లు, మెడ నొప్పుల నుంచి ఉపశనం లభిస్తుంది.
ఉప్పు కూడా నొప్పులకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా దొడ్డుప్పును తీసుకొని పెనంపై వేడి చేయాలి. ఆ తర్వాత వేడి చేసిన ఉప్పును ఒక క్లాత్‌లోకి తీసుకొని నొప్పి ఉన్న చోట అద్దాలి ఇలా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అరటి పండ్లు కూడా ఒంటి నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాసియం కండరాల నొప్పిని దూరం చేస్తుంది.
బెర్రీలు కూడా ఒంటి నొప్పులను తగ్గిస్తాయి. ముఖ్యంగా బెర్రీలను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల దీర్ఘకాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.