Andhra Pradesh: తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డి పాలెంలో ఈ ఏడాది జూలై పదిహేనో తేదిన స్కూల్ కు వెళ్లిన విద్యార్ధిని ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి, తమ్ముడు ఎక్కడికి వెళ్లిందో అంటూ గ్రామంలో వెతకడం ప్రారంభించారు. వారి ఇంటికి సమీపంలో ఉండే నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో బాలిక శవమై కనిపించింది. అయితే ఆ ఇంటి నుండి నిందితుడు నాగరాజు పారిపోవడంతో...
వివాహేతర సంబంధం కొనసాగింపులో తెలెత్తిన అనుమానం బాలిక నిండు ప్రాణం తీసింది. తల్లిపై చెప్పలేని కోపాన్ని కూతురిపై చూపించి కర్కసత్వాన్ని చాటుకున్నాడో ప్రబుద్దుడు. హత్య చేసి తెలివిగా తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. నాలుగు నెలల తర్వాత ఆధునిక సాంకేతికత ఉపయోగించి ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డి పాలెంలో ఈ ఏడాది జూలై పదిహేనో తేదిన స్కూల్ కు వెళ్లిన విద్యార్ధిని ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి, తమ్ముడు ఎక్కడికి వెళ్లిందో అంటూ గ్రామంలో వెతకడం ప్రారంభించారు. వారి ఇంటికి సమీపంలో ఉండే నాగరాజు అనే వ్యక్తి ఇంటిలో బాలిక శవమై కనిపించింది. అయితే ఆ ఇంటి నుండి నిందితుడు నాగరాజు పారిపోవడంతో అతనిపైనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే కొన్నేళ్ల కిందట నాగరాజు కొండపల్లి ప్రాంతం నుండి వలస వచ్చి గ్రామంలో ఉంటూ గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాగరాజుకు, మైనర్ బాలిక తల్లి ఎస్తేరు రాణి అలియాస్ ఇందిరతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ సంబంధం కొన్నేళ్ల పాటు సాగింది. అయితే కొద్ది రోజులుగా ఆమె నాగరాజును దూరం పెడుతూ వచ్చింది. కావాలనే తనను దూరం పెడుతుందన్న కోపంతో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక స్కూలు వెళ్లిన రోజు పాఠశాల వద్ద మాటు వేశాడు. బాలిక ఇంటికి వస్తుండగా తన రూంకి తీసుకెళ్లాడు. తన కుటుంబానికి తెలిసిన వ్యక్తి కావడంతో బాలిక అతనితో పాటు అతని ఇంటికి వెళ్లింది. అయితే అప్పటికే ఆమె తల్లిపై పెంచుకున్న కోపాన్ని బాలికపై చూపించాడు.
బాలిక గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లిపోయాడు. చేబ్రోలు వెళ్లి ఫోన్ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడు కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో కొండపల్లి ప్రాంతంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నాగరాజు ఆమెను హత్య చేసి గుంటూరు వైపు పారిపోయి వచ్చాడు. అలాగే ఈసారి కూడా బాలిక ను హత్య చేసిన తర్వాత వివిధ రాష్ట్రాలకు పారిపోయాడు. అతన్ని కోసం పోలీసులు ఎంతగా గాలించిన చిన్న క్లూ కూడా లభించలేదు.
అయితే ఎస్పీ సతీష్ కుమార్ నిందితుడిని పట్టుకొని తీరాలన్న ఆదేశాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గతంలో అతను ప్రవర్థించిన తీరుతో వివిధ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఈక్రమంలోనే రాజమండ్రి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నాగరాజును పట్టుకొని అరెస్ట్ చేశారు. కేసు చేధనలో ప్రతిభ చూపించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..