Telangana: ప్రియుడి మోజులో భార్యల కిరాతకం.. స్కెచ్ వేసి మరీ భర్తల హతం

ఈ నెల 7న వెల్దండ మండలం ఎంజీ తండాలో వివాహేతర సంబందానికి అడ్డుగా ఉన్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భార్య హత మార్చింది. ఎంజీ కాలనీ తండాకు చెందిన రాజు, హిమబిందు తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాలంగా హిమబిందు మహేశ్వరం మండలం కళ్లెంచెరువు తండాకు చెందిన చంటితో వివాహేతర సంబంధం...

Telangana: ప్రియుడి మోజులో భార్యల కిరాతకం.. స్కెచ్ వేసి మరీ భర్తల హతం
Telangana
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 02, 2024 | 10:02 PM

ప్రియుడి మోజులో పడి భర్తలను హత్యలు చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక్క నెలలోనే ఈ తరహా ఘటనలో ముగ్గురు భర్తలు ప్రాణాలు కోల్పోయారు. వివాహేతర బంధాలకు అడ్డు వస్తున్నారని పక్క స్కెచ్ వేసి మరి భర్తలను కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. దాంపత్య జీవితం అర్థమే మారుస్తూ… కుటుంబాలను ఆగం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చీకటి నింపుతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త జీవితాన్నే కలారాస్తున్నారు భార్యలు. ఒకటి కాదు రెండు కాదు ఒక్క నెలలోనే ముగ్గురు భర్తలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇందులో ప్రేమ వివాహాలు సైతం అతీతం కాకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. పచ్చని కాపురల్లో ఈ వివాహేతర సంబంధాలు చిచ్చుపెట్టిన అమాయక భర్తలు ప్రాణాలు బలిగొంటున్నాయి.

ఈ నెల 7న వెల్దండ మండలం ఎంజీ తండాలో వివాహేతర సంబందానికి అడ్డుగా ఉన్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భార్య హత మార్చింది. ఎంజీ కాలనీ తండాకు చెందిన రాజు, హిమబిందు తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాలంగా హిమబిందు మహేశ్వరం మండలం కళ్లెంచెరువు తండాకు చెందిన చంటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రియుడు చంటి, అతడి స్నేహితుడు రాకేష్ సహాయంతో ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి ఎంజీకాలనీ తండాలో వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న రాజును సుత్తితో తలపై మోది కిరాతకంగా హతమార్చారు.

ఈ నెల10న తిమ్మాజిపేట మండలం రాళ్ల చెరువు తండాలో తోడబుట్టిన అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు తమ్ముడు. అంతటితో ఆగకుండా ఆ చీకటి బంధానికి అడ్డుగా ఉన్నాడని అన్నను తమ్ముడి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. రాళ్ల చెరువు తండాకు చెందిన సభావత్ శ్రీను (40), గోపాల్ అన్నదమ్ముళ్లు. కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్న గోపాల్.. తన అన్న భార్య శాంతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీను వారిద్దరిని మందలించాడు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న శ్రీనును ఎలాగైనా హతమార్చాలని పథకం రచించారు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీను తలపై గోపాల్ సభావత్ శ్రీను కర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా అదే తండాలో నివాసముంటున్న తన అత్తగారి ఇంటి ఎదుట మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.

ఇక నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీడీవో కార్యాలయ అటెండర్ చింతల పల్లి జగదీశ్ (35)ఈ నెల 24న దారుణ హత్యకు గురయ్యాడు. అల్లీపూర్ శివారులోని కెఎల్ఐ కాల్వలో జగదీష్ మృత దేహం బయటపడగా, పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని విచారణ ప్రారంభించారు. భార్య కీర్తి తన ప్రియుడు నాగరాజుతో పాటు అతని స్నేహితులతో కలిసి దాడిచేసి హతమార్చినట్లు విచారణలో తేలింది. హత్యోదంతంలో పోలీసులు కొత్తకోణం వెలుగులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చెట్టు కల్లులో మత్తు పదార్థం వాడి భర్త హత్యకు పథకం రచించారు. గుడ్లనర్వ గ్రామానికి చెందిన ప్రియుడి నాగరాజుతో పాటు భార్య తల్లి, తమ్ముడు సైతం హత్యోదంతంలో చేతులు కలిపారు. కల్లులో మత్తుమందు కలిపి జగదీశ్ చేత తాగించారు. జగదీష్ స్పృహ కోల్పోయిన తర్వాత కారులో తూడుకుర్తి గ్రామ శివారులోని జగదీష్ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు.

మొదట అక్కడే కరెంట్ షాక్ తో చంపాలని భావించారు. సమయానికి కరెంట్ లేకపోవడంతో ప్లాన్ మార్చారు. KLI కాల్వలో తోసేశారు… అంతటితో ఆగకుండా జగదీష్ ను నీళ్లలో ముంచి దారుణంగా హతమార్చారు. జరిగిన మూడు ఘటనల్లో స్వయంగా భర్త హత్యలో నేరుగా పాత్రదారులయ్యారు భార్యలు. మళ్ళీ ఏమి ఎరగనట్లు అయ్యో నా మొగుడిని హత్య చేశారని నటించడం గమనార్హం. ఇక ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేసి… జీవితాన్ని చీకటి చేసుకున్నారు ఈ మహిళామణులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఏంటి నిజంగానే ఆయుర్వేదం చాక్లెట్స్ అనుకుంటున్నారా..?
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
ఐఫోన్‌ 17 గురించి అప్పుడే మొదలైన చర్చ.. ఈసారి భారీగానే ప్లాన్‌..
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
క్రిప్టో కరెన్సీ పేరుతో ఇది మాములు మోసం కాదు భయ్యా...
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ట్రక్ ఇంజిన్‌ల్లోంచి వింత శబ్ధాలు.. 98 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్న మ్యాన్‌ ఈటర్‌
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
బాలీవుడ్ నటితో కోహ్లీకి ఎఫైర్.. అసలు విషయం ఏంటో తెలుసా?
కేంద్ర మంత్రులతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ
కేంద్ర మంత్రులతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ
తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
తల్లితో వివాహేతర సంబంధం, బిడ్డను చంపిన వైనం.. చివరికి..
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
సినిమాలకు గుడ్ బై చెప్పేసిన 12th ఫెయిల్ హీరో ఆస్తుల వివరాలివే
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపిన భర్త.. కోపంతో స్థానికులు చేసిన
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా