AP News: క్రిప్టో కరెన్సీ పేరుతో 315 మంది నుంచి రూ.27 కోట్లు కొట్టేశాడు.. కట్ చేస్తే..
క్రిప్టో కరెన్సీ కేటుగాణ్ణి ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. ఘరానా మోసగాన్ని చేధించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. క్రిప్టో కరెన్సీ దోపిడీపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసాన్ని చేధించారు పోలీసులు. క్రిప్టో కరెన్సీ పేరుతో 23 కోట్ల రూపాయాల మోసానికి పాల్పడ్డ కేటుగాణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డోన్‌లో 2021 నుండి కేవ ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో డోన్ ప్రజలకు పరిచయం అయిన రామాంజనేయులు 315 మంది బాధితుల నుంచి 23కోట్లు కొల్లగొట్టినట్లు నిర్ధారించారు పోలీసులు. నిందితుడి అకౌంట్‌లో ప్రజెంట్ రెండు కోట్ల 13 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించి ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఇంకెవరైనా బాధితులు ఉంటే తగిన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి బాధితుల నుంచి 23 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
క్రిప్టో కరెన్సీ మోసానికి పాల్పడ్డ నిందితుడు అనంతపురం జిల్లా గుత్తి మండలం పెద్దవడుగూరు గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. 2021లో కేవ ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ స్థాపించిన రామాంజనేయులు.. ఇదే కంపెనీ పేరిట క్రిప్లో కరెన్సీ చెలామణిని తెరమీదకు తీసుకువచ్చాడు. నూటికి పదిరూపాయల వడ్డీ ఆశ చూపించి భారీ ఆదాయం పేరిట ప్రజలను ఆకట్టుకున్నాడు. చివరకూ వడ్డీ, క్రిప్టో కరెన్సీ ఇవ్వకపోవడంతో గట్టిగా నిలదీసిన ఖాతాదారులకు రూ.17 కోట్లు చెల్లించాడు. మిగిలిన సొమ్మును రామాంజనేయులు నుంచి వసూలు చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసుపై అనేక కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. రామాంజయనేయులు వెనుక ఇంకేవరైనా ఉండి నడిపించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..