Sankranthi Festival: పందెం కోళ్లు, ప్రత్యేక బహుమతులు.. కోనసీమలో సంక్రాంతి జోష్
సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ప్రతి ఒక్కరూ సొంతిళ్లకు వెళ్లి తమ కుటుంబ సభ్యులతో గడుపుతారు. అలాగే కోళ్ల పందేల్లో పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సంక్రాంతికి ఎలాంటి పందేలు, జూదాలు వంటివి నిర్వహించకూడదని రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ సరదాగా నిర్వహించే పోటీలు మాత్రం ఎక్కడా బ్రేక్ వేయడం లేదు.

సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ప్రతి ఒక్కరూ సొంతిళ్లకు వెళ్లి తమ కుటుంబ సభ్యులతో గడుపుతారు. అలాగే కోళ్ల పందేల్లో పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సంక్రాంతికి ఎలాంటి పందేలు, జూదాలు వంటివి నిర్వహించకూడదని రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ సరదాగా నిర్వహించే పోటీలు మాత్రం ఎక్కడా బ్రేక్ వేయడం లేదు. ఇదిలా ఉంటే ఈ సారి సంక్రాంతికి మరింత జోష్ నింపేలా పందేల్లో పాల్గొనండి, విలువైన బహుమతులు గెలుపొందండి అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో కొందరు ఉత్సాహం చూపుతూ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా వివిధ పందేల్లో కార్లు, బుల్లెట్ బైకులులతో పాటు ఇతర గృహోపకరణకు యోగ్యమైన వస్తువులను గిప్ట్ లుగా ప్రకటిస్తున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కోళ్ల పందేళ్లో పాల్గొంటారని బరుల నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నారాయణపురం, తణుకు, భీమవరం పరిసర ప్రాంతాల్లో ఇలాగే పందేలు నిర్వహించినట్లు చెబుతున్నారు బరుల నిర్వహాకులు. ఈ పందేల్లో పాల్గొనే వారిని రెండు టీములుగా నిర్ణయిస్తారు. ఇద్దరికీ 9 రౌండ్లలో పందేలు నిర్వహిస్తారు. వీటిలో 5 పందేలు గెలిచిన వారికి బుల్లెట్ బైకులు, కార్లు అందజేస్తారు. ఈ బహుమతులను పందెంలో కాసిన మొత్తం డబ్బుల్లో నుంచి 10శాతం తీసి ఇలాంటివి కొనుగోలు చేసి పోటీలో పాల్గొన్న వారికి అందజేస్తారు.
ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా జిల్లాల్లో లాడ్జిలు, హోటల్లు ఫుల్ అయిపోయాయి. ఈసారి సంక్రాంతిని ధూంధాంగా నిర్వహించేందుకు పల్లెలు వేచి చూస్తున్నాయి. పందేలు నిర్వహిచే వారితోపాటు అందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపే వారు కూడా ముందుగానే ఆయా గ్రామాలకు చేరుకుంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ మాత్రమే కాకుండా వరుసగా పది రోజుల పాటు ఈ బరులను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. పందేలను నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ప్రాంతాలను వేలం పాట పాడి కైవసం చేసుకుంటున్నారు. రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ వేలం పాటలో తాత్కాలికంగా లీజుకు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు నిర్వహకులు. కేవలం బరుల వద్ద నిలబడే కాకుండా ఆన్లైన్ లో కూడా పందేలు వేసేందుకు పలు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పందేల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, కోస్తాంధ్ర నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పందెంగాళ్లు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




