Chicken Price: చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. సగానికి సగం తగ్గిన రేట్లు
నిన్నటి దాకా కొండెక్కి కూర్చుని దిగి రమ్మంటే రానంటూ కొక్కొరొకో అన్న కోడి ధరలు ఇప్పుడు భారీగా తగ్గటం ప్రధానంగా కనిపిస్తుంది. చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గడంతో నాన్‌వెజ్ లవర్స్ ఖుష్ అవుతున్నారు. వారం రోజుల క్రితం కిలో బ్రాయిలర్ కోడి మాంసం(స్కిన్‌లెస్) రూ.250 వరకు ఉండగా ప్రస్తుతం రూ.170 లోపే విక్రయిస్తున్నారు. అయితే గుడ్ల ధర మాత్రం తగ్గలేదు.
నాన్ వెజ్ ప్రియులకు పండక్కి కిర్రాక్ న్యూస్ వచ్చింది. కార్తీక మాసంలో తగ్గిన చికెన్ ధరలు.. ఆ తర్వాత జెట్ స్పీడుతో దూసుకెళ్లాయి. న్యూ ఇయర్ వేళ.. అయితే రేటు పైపైకి ఎగబాకింది. తాజాగా రేట్లు డౌన్ అయ్యాయి. సగానికి సగం తగ్గాయి. గత వారం ఆంధ్రాలో చికెన్ ధర 240 నుంచి 260 ఉండగా.. ప్రస్తుతం 120నే ఉంది. క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం వరకు దుమ్ము లేపిన చికెన్ ధర.. సరిగ్గా పొంగల్‌కి సగానికి పడిపోవడం.. సామాన్యులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ప్రస్తుతం కేజీ చికెన్ రేటు స్కిన్ లెస్ అయితే.. రూ.150 నుంచి 160 గా ఉంది. ఇక స్కిన్ చికెన్ అయితే రూ. 120 నుంచి 130 గా ఉంది. తెలంగాణలో విషయానికి వస్తే.. కిలో చికెన్ రేటు రూ. 160 నుంచి 170గా నడుస్తోంది. విత్ స్కిన్ చికెన్ ధర రూ. 150 గా బోర్డులు కనబడుతున్నాయి. గడిచిన నాలుగు నెలల్లో కనిష్ఠ స్థాయికి చికెన్ ధర చేరుకోవడం గమనార్హం. వారం రోజులుగా చికెన్ ధరలు స్లో స్లోగా డౌన్ అయ్యాయి. పండక్కి అమ్మకాలు భారీగానే జరగనున్నాయి. లాభాలు పెద్దగా లేకపోయినా.. వ్యాపారం మాత్రం ఎలాంటి నష్టం లేకుండా జరుగుతుందని ఫౌల్ట్రీఫాం నిర్వాహకులు చెబుతున్నారు.
చికెన్ ధర తగ్గితే.. గుడ్డు రేటు పెరిగింది…
చికెన్ ధరలు భారీగా తగ్గితే.. గుడ్ల ధరలకు మాత్రం పెరిగాయి. తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతున్నాయి. ఆంధ్రా, తెలంగాణల్లో.. ఒక్కో గుడ్డు ధర.. రూ.7 నుంచి రూ.8 రూపాయలు వరకు ఉంది. బల్క్ అయితే రూ.6 చొప్పున విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుంటం వల్ల కోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుండటంతో.. కోడి గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.