Pulasa Fish: ఆహా.. పులసనా మజాకా..! బంగారంతో పోటీపడుతున్న గోదావరి లైవ్ ఫిష్.. ధర తెలిస్తే షాకే..

|

Oct 10, 2022 | 7:30 PM

పులస.. ఈ పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస క్రేజే వేరు.. దీనికోసం చాలామంది ఎగబడుతుంటారు. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస తినాలంటారు పెద్దలు.

Pulasa Fish: ఆహా.. పులసనా మజాకా..! బంగారంతో పోటీపడుతున్న గోదావరి లైవ్ ఫిష్.. ధర తెలిస్తే షాకే..
Pulasa Fish
Follow us on

పులస.. ఈ పేరు వింటేనే చాలామందికి నోరూరిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస క్రేజే వేరు.. దీనికోసం చాలామంది ఎగబడుతుంటారు. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస తినాలంటారు పెద్దలు. అనడమే కాదు, ఎంత రేటైనా పెట్టి కొని తింటారు. అందుకే.. పులస ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు తిరగరాస్తూ ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేదారి లంక‌ గోదావరిలో లైవ్ పులస దొరికింది. మాములుగా పులస వలలో పడగానే పదినిమిషాల్లో చనిపోతుంది. కాని జాలరి చందాడి సత్యనారాయణ వలలో పడ్డ పులస లైవ్ గా దొరికింది. దీంతో తన పంట పండిందనుకున్నాడు ఆ మత్స్యకారుడు. లైవ్ లో దొరికిన సుమారు కేజీ ఉన్న గోదావరి పులసను మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన నల్లి రాంప్రసాద్ అనే పులస ప్రియుడు ఏకంగా 17 వేల రూపాయలు పెట్టి కొన్నాడు.

ఇదిలా వుంటే సుమారు పది ముక్కలు తెగిన ఈ పులస ఖరీదు అర గ్రాము బంగారంతో సమానమయ్యిందని కొందరు లెక్కలు కడుతున్నారు. లెక్క ఎలా ఉన్నా కాని ముక్క మాత్రం సూపర్ అంటున్నారు లైవ్ పులసను కొన్న రాంప్రసాద్. అందుకేనేమో పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి అన్నారు పెద్దలు. గోదావరి పులసా మజాకా అంటూ చాలామంది పేర్కొంటున్నారు.

అయితే.. పులస దొరకడమే గగనమనుకుంటే లైవ్ పులస దొరకడంతో జాలరి సత్యనారాయణ సంబరపడ్డాడు. అంతేకాకుండా వేలాది రూపాయలు రావడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. లైవ్ పులస దొరకడం చాలా అరుదని మత్స్యకారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

-రిపోర్టర్ సత్య, టీవీ9 తెలుగు, రాజమండ్రి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..