Big News Big Debate: ఆంధ్రాలో రాజధాని రణరంగం.. మొత్తానికి ఉత్తరాంధ్ర లీడర్ల గర్జనలు..
అటు అమరావతి పాదయాత్ర.. ఇటు వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమ కార్యాచరణతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర సాగుతుండగా..
అమరావతి కోసం రైతుల పాదయాత్ర కొనసాగుతుంటే… అటు ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమం ఊపందుకుంటోంది. జేఏసీ ఏర్పాటు చేసి మరీ కార్యాచరణ కూడా ప్రకటించారు స్థానిక నేతలు. కేపిటల్ సెగ ఇప్పుడు రాయలసీమకు కూడా పాకింది. కొందరు వైసీపీ నాయకులు వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాలకు సిద్ధపడగా… దమ్ముంటే ప్రభుత్వం రద్దు చేసి మరీ ఎన్నికలకు వెళదామని సవాల్ చేసింది తెలుగుదేశం పార్టీ. అసలు మీ రెండు పార్టీలకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదని ప్రశ్నిస్తోంది భారతీయ జనతాపార్టీ. కేపిటల్ కట్టాలన్నా.. స్టేట్ డెవలప్ కావాలన్నా తమతోనే సాధ్యమంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..