CM Yogi Adithyanath: చిరుతకు పాలు తాగించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. వైరల్ అవుతున్న వీడియో.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జంతుప్రదర్శనశాలను సందర్శించారు. ఈ క్రమంలో సీఎం అక్కడ ఒక చిరుతపులి పిల్లకు పాలు పట్టించారు...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జంతుప్రదర్శనశాలను సందర్శించారు. ఈ క్రమంలో సీఎం అక్కడ ఒక చిరుతపులి పిల్లకు పాలు పట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ అధికారిక యూట్యూబ్ పేజీలో షేర్ చేసింది. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్‌తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్‌క్లోజర్‌లో ఉన్న చిరుతలను చూపించారు. వెటర్నరీ డాక్టర్ ఓ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి సీఎంకు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఒక చిరుత పిల్లను ఎత్తుకొని పాలబాటిల్‌తో పాలు పట్టించారు. అంతేకాదు.. ఆ జూలో ఉన్న మిగతా పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

