Odisha-AP Border dispute: పచ్చని కొండల మధ్య పోలీసుల కవాతు.. కొటియా గ్రామాల్లో కొత్త సమస్యలు

ఒడిశా-ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లో మళ్లీ టెన్షన్ మొదలైంది. కొటియా వెళ్లేందుకు ఎమ్మెల్యే రాజన్న సిద్ధమయ్యారు. ఆయనతో పాటు అధికార యంత్రాంగం కూడా ముందుకు కదిలేందుకు సై అంటోంది.

Odisha-AP Border dispute: పచ్చని కొండల మధ్య పోలీసుల కవాతు..  కొటియా గ్రామాల్లో కొత్త సమస్యలు
Odisha Andhra Pradesh Kotia Border Dispute
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 16, 2021 | 12:55 PM

Kotia border dispute: ఒడిశా-ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లో మళ్లీ టెన్షన్ మొదలైంది. కొటియా వెళ్లేందుకు ఎమ్మెల్యే రాజన్న సిద్ధమయ్యారు. ఆయనతో పాటు అధికార యంత్రాంగం కూడా ముందుకు కదిలేందుకు సై అంటోంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు రాకుండా ఒడిశా చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. నంద చెక్‌పోస్ట్ దగ్గర ఏపీ అధికారుల్ని ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన మొదలైంది.

ఏపీ, ఒడిశా సరిహద్దులో ఉన్న రెండు పల్లెలు.. పచ్చని కొండల మధ్య అహ్లాదకర వాతావరణంలో ఉంటాయి. ఇవి రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంటాయి. దీంతో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ ఉన్నాయి. ఒకప్పుడు 22 గ్రామాలు ఈ వివాదాల్లో ఉండగా.. జనాభా పెరుగుదల, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అవి 34 పల్లెలుగా రూపాంతరం చెందాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ.. ఈ గ్రామాలను తమ రాష్ట్రానికి చెందినవే అన్నట్టుగా ఇక్కడి వారి బాగోగులను చూసుకుంటూ ఉంటాయి. ఇవి ఏ రాష్ట్రంలో కలవకపోయినా.. ఇరు రాష్ట్రాల్లోనూ ఓటరు కార్డులున్నాయి ఇక్కడి గిరిజనులకు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా కొటియా గ్రామాల సమస్యలు మాత్రం తీరలేదు.

ఈ మధ్య ఒడిశా ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయినప్పటికీ.. 8 గ్రామాల ప్రజలు మాత్రం ఏపీలో విలీనమయ్యేందుకే మొగ్గుచూపుతున్నారు. తమను కలుపుకోవాలని కోరుతున్నారు. తాము కూడా తెలుగువారమేనంటూ ఆధారాలు చూపిస్తున్నారు. స్థానికులంతా ఏపీ కావాలని కోరుకుంటున్నా.. ఒడిశా మాత్రం ససేమిరా అంటోంది. దీంతో పీటముడి కాస్త తెగని పంచాయితీగా మారింది. లెటెస్ట్‌గా ఎమ్మెల్యే రాజన్న దొర కొటియా గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఒడిశా ప్రభుత్వం మాత్రం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటోంది. ఈ క్రమంలోనే ఒడిశా-ఏపీ సరిహద్దుల్లో ఏపీ ప్రజాప్రతినిధులు, అధికారులు రాకుండా ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే రాజన్న దొర, అధికారులు కొటియా వెళ్లేందుకు సిద్ధమవడంతో వారిని అడ్డుకునేందుకు..ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు ఒడిశా పోలీసులు. నంద చెక్‌పోస్ట్‌ దగ్గర ఏపీ అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.