
ఏలూరు, సెప్టెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వైసీపీ ప్రభుత్వం విద్యాసంస్కరణలో తీసుకోచ్చిన ఎనలేని మార్పులు కారణంగా ఈ అరుదైన అవకాశం లభించింది . ఈ నేపథ్యంలో నూతన విద్యా సంస్కరణల ద్వారా ఫలాలు అందుకున్న తెలుగు విద్యార్థులకు ఐక్యరాజ్యసమితి నుండి ఆహ్వానం లభించింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదిమంది విద్యార్థుల బృందం అమెరికాలో రెండు వారాలు పర్యటిస్తుంది. ఇలా తెలుగు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి.
ఈ విద్యార్థులకు మరో అరుదైన ఆహ్వానం కూడా అందింది. ఈ బృందాన్ని వరల్డ్ బ్యాంక్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ మరియు కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ డిసి లోని వైట్ హౌస్ ను సందర్శించాలని అమెరికా అధికారులు ఆహ్వానించారు. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ ఘనత సాధించడంతో భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంపై ఫోకస్ పెట్టాయి. తక్కువ సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఇదే ప్రథమం.. ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమాలకు వెళ్లిన విద్యార్థులు సైతం సాధారణ మధ్యతరగతి గ్రామీణ కుటుంబాలకు చెందిన విద్యార్థులు కావడం గమనార్హం..
విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలు చాలా సాధారణమైనవి. అందులో కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు రోజువారి కూలీలు, మరికొందరు మెకానికులు, ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లుగా జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను కార్పొరేట్ కళాశాలలకు తలదన్నేలా పునరుద్ధరించారు. అదేవిధంగా విద్యార్థులకు ఇంగ్లీష్ బోధనతో పాటు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. విద్యార్థుల తండ్రి తండ్రులకు చదువులకు సంబంధించి ఆర్థిక భారం పడకుండా ప్రతి యేట అమ్మబడి పేరుతో విద్యార్థుల తల్లుల ఎకౌంట్లోకి రూ.15 వేలు అందిస్తున్నారు. అలాగే జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన లాంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు.
విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫార్మ్స్, ట్యాబ్లు ఉచితంగా ఇస్తూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో సీట్లు ఖాళీగా లేవు అనే బోర్డులు కూడా ఏర్పాటు చేశారంటే ఎంతగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిందో మనకు అర్థమవుతుంది. అయితే ఐక్యరాజ్యసమితిలో తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్కరణల గురించి, తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అంతర్జాతీయంగా వివరించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం