- Telugu News Photo Gallery Political photos Narendra Modi Launches 'PM Vishwakarma' Scheme To Provide Loan Assistance To Traditional Craftsmen, Artisans See Photos
PM Modi: పీఎం విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.. కార్మికులతో కాసేపు ముచ్చటించి..
PM Vishwakarma: దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక, సామాజిక భద్రత కోసం మోదీ సర్కార్ మరో కీలక అడుగును వేసింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విశ్వకర్మ యోజను.. ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తులు, కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం.. ప్రాచీన సంప్రదాయం, సంస్కృతి, విభిన్న వారసత్వాన్ని సజీవంగా, స్థానిక ఉత్పత్తులు, కళలు, సంపన్నంగా ఉంచడమే పీఎం విశ్వకర్మ స్కీం లక్ష్యం.
Updated on: Sep 17, 2023 | 5:19 PM

మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అంతకుముందు, ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో కొత్త పథకం 'పిఎం విశ్వకర్మ'ను ప్రారంభించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మకు పూజలు నిర్వహించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన పుట్టినరోజు ప్రత్యేక సందర్భంలో.. అతను చాలా మంది కళాకారులను కలిశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడి ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో కళాకారులతో ముచ్చటించారు. అక్కడ సిద్ధం చేసిన కళాఖండాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

తన ప్రత్యేక రోజు సందర్భంగా, ప్రధాని మోదీ చాలా మంది వ్యక్తులను కలిశారు. మొదటిది ప్రధాని మోదీ కార్మికులను కలుసుకున్నారు.

వారితో పాటు మహిళా టైలర్లు, పడవ తయారీదారులతోపాటు ఇతర కళాకారులను కలిశారు.

PM తన పుట్టినరోజు సందర్భంగా PM విశ్వకర్మ పోర్టల్‌ను ప్రారంభించారు. దీనిపై బయోమెట్రిక్ విధానంలో కళాకారులను ఉచితంగా నమోదు చేయనున్నారు. ఈ సందర్భంగా కుమ్మరి పనివారిని ప్రధాని మోదీ కలుసుకున్నారు.

కుమ్మరి పనివారితోపాటు మోచీ పనివారిని.. అంటే చెప్పులు తయారు చేసేవారితో కాసేపు ముచ్చటించారు

చెప్పులు, షూస్ తయారు చేసే కుల వృత్తులవారితో ప్రత్యేకంగా కాసేపు మాట్లాడారు. వారు చేసే పనిలో నైపుణ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతి వృత్తులు, కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం.. ప్రాచీన సంప్రదాయం, సంస్కృతి, విభిన్న వారసత్వాన్ని సజీవంగా, స్థానిక ఉత్పత్తులు, కళలు, సంపన్నంగా ఉంచడమే పీఎం విశ్వకర్మ స్కీం లక్ష్యం.





























