కర్నూలులో వైసీపీకి తలనొప్పిగా మారిన ఈ సమస్య..

| Edited By: Srikar T

Apr 04, 2024 | 7:30 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు వైసిపి ఇటు తెలుగుదేశం పార్టీలలో నాన్ లోకల్ సమస్య వెంటాడుతోంది. అభ్యర్థులు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రావడం కలకలం రేపుతుంది. దీంతో నాన్ లోకల్ మాకు వద్దు అంటూ క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు.

కర్నూలులో వైసీపీకి తలనొప్పిగా మారిన ఈ సమస్య..
Tdp,Ycp
Follow us on

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు వైసిపి ఇటు తెలుగుదేశం పార్టీలలో నాన్ లోకల్ సమస్య వెంటాడుతోంది. అభ్యర్థులు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రావడం కలకలం రేపుతుంది. దీంతో నాన్ లోకల్ మాకు వద్దు అంటూ క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు.

కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ నగరానికి కొత్త. ఎన్నికలలో పోటీకోసమే ఐఏఎస్‎కి రిజైన్ చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇప్పించకుండా ఉండటం కోసం విఫల యత్నం చేశారు.

కోడుమూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సతీష్‎ది నేటివ్ కర్నూలు జిల్లానే కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు. మంత్రి ఆదిమూలపు సురేష్‎కి స్వయానా సోదరుడు. ఆయనకి కోడుమూరు టికెట్ రావడంతో.. టికెట్ ఆశించి భంగపడిన దాదాపు పది మంది నేతలు నాన్ లోకల్ సమస్య తీసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మిగనూరులో కూడా వైసీపీలో కొంత నాన్ లోకల్ సమస్య ఉంది. బుట్ట రేణుకది ఎమ్మిగనూరు నేటివ్ కాదు. అయితే రేణుక ఎంపీగా పనిచేసిన కర్నూలు పార్లమెంటు పరిధిలోనే ఎమ్మిగనూరు ఉంది. దీంతో ఇది నాన్ లోకల్ కిందికి రాదని ఆమె వాదిస్తున్నారు.

ఆదోనిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ స్థానాన్ని తెలుగుదేశం.. బిజెపికి కేటాయించింది. డాక్టర్ పార్థసారథి బిజెపి తరఫున అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్థసారధి లోకల్ కాదని నాన్ లోకల్ అని టిడిపి టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కూడా టిడిపి అధిష్టానం దూతలను పంపి వివరణ ఇప్పిస్తున్నారు.

నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్‎ని పార్టీ ప్రకటించింది. సుధీర్ నాన్ లోకల్. ఉమ్మడి కర్నూలు జిల్లానే కాదు. పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి. గతంలో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. దీంతో నాన్ లోకల్‎కి టికెట్ ఇచ్చారంటూ వైసీపీ నందికొట్కూరు టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రచారం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..