Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పొదల నుంచి విచిత్ర వాసన.. వెళ్లి చూడగా ఏవో సంచులు.. ఓపెన్ చేయగా

ఈ విషయం తెలిస్తే ఏం క్రియేటివిటీరా బాబు అని విస్మయం వ్యక్తం చేస్తారు. అసలు ఇన్ని చావు తెలివితేటలు ఎలా అని నివ్వెరపోతారు. అక్రమ దందాలను కొనసాగించేందుకు పుష్ప రేంజ్ ఐడియాలు వాడుతున్నారు. అయినప్పటికీ ఇక్కడ పోలీసులకు చిక్కారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...

AP News: పొదల నుంచి విచిత్ర వాసన.. వెళ్లి చూడగా ఏవో సంచులు.. ఓపెన్ చేయగా
Bushes (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2024 | 7:39 PM

వామ్మో ఖతర్నాక్ కంత్రీ గాళ్లు రోజురోజకు పెరిగిపోతున్నారు. క్రైమ్ చేసేందుకు వారు ఎంచుకునే రూట్లను చూసి పోలీసులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజంట్ భారతదేశ విలువైన ఆస్తి అయిన యువతను నిర్వీర్యం చేస్తున్నది గంజాయి. ఈ మత్తును తరిమేందుకు పోలీసులు విసృతంగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్ల మాయలీలలు వెలుగుచూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లా.. చింతపల్లి మండలంలోని కిటుముల పంచాయతీ చీమలపాడు గ్రామ శివారులో.. వివిధ ప్రాంతాలకు సప్లై చేసేందుకు పొదల్లో దాచిన 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా ఈ గంజాయిని ఒరిస్సా నుంచి తరలించేందుకు గుర్రాలను వినిమోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా కంపల్లో దాన్ని నిల్వ ఉంచినట్లు తెలిపారు. ఈ గంజాయి రవాణాకి సహకరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ.7.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Ganja

Ganja

ఈ మధ్య చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయం

— రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. 92 గంజాయి చాక్లెట్లను రాజేంద్రనగర్ SOT బృందం సీజ్ చేసింది..చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో SOT టమ్‌ రంగంలోకి దిగి తోల్ కట్టా దగ్గర ఓ షెడ్డుపై దాడి చేసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేశారు SOT అధికారులు..పట్టుబడిన వారిలో ఒకరు పాత నేరస్థుడు ముస్తబా అలీ ఖాన్‌గా గుర్తించారు..ముగ్గురు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు..అయితే పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా గంజాయి ముఠా అదుపు తప్పుతోంది..విద్యార్థులే టార్గెట్‌గా..చాక్లెట్లు ఇచ్చి వ్యసనంగా మార్చి గంజాయి ముఠా సొమ్ము చేసుకుంటున్నారు..తాజాగా మరో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు SOT అధికారులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…