
దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ డెల్టా ప్లస్ కేసు నమోదైనట్లు సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు.
ఏప్రిల్ నెలలో తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు ఒకటి నమోదైందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అంతేకాకుండా ఆ డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తయిందని.. కోలుకోవడం కూడా జరిగిందని ఆయన తెలిపారు. బాధితుడి నుంచి ఇతరులెవరికీ వ్యాపించలేదన్న మంత్రి.. ప్రస్తుతం రాష్ట్రంలో డెల్టా ప్లస్ యాక్టివ్ కేసులు లేవని స్పష్టం చేశారు. డెల్టా ప్లస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. థర్డ్ వేవ్ వచ్చినా.. దానిని ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగింపుపై సీఎం వైఎస్ జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.
Also Read:
ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!
ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!