Andhra News: వారెవ్వా..!! ఏం క్రియేటివిటీ బాసూ.. దెబ్బకు పొలిటికల్ లీడర్స్ ఫ్లాట్ అవ్వాల్సిందే..!
తిరుపతిలో టెంపుల్ సిటీలో న్యూ ఇయర్ కోసం ట్రెండీ డిజైన్లతో ఫ్లవర్ బొకేలు అందరీని ఎంతోగాను ఆకట్టుకుంటున్నాయి. ఏటా వినూత్నంగా బొకేలను తయారు చేస్తున్న తయారీదారులు ఈ ఏడాది పొలిటికల్ పార్టీలకు ప్రాధాన్యతను ఇచ్చినట్లు కనబడుతుంది. నిర్వాహకులు రూ.500 నుంచి రూ. 10 వేల ఖరీదైన బొకేలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
టెంపుల్ సిటీలో న్యూ ఇయర్ కోసం ట్రెండీ డిజైన్లతో ఫ్లవర్ బొకేలు ఆకట్టుకుంటున్నాయి. పొలిటికల్ లీడర్స్‌కు విషెస్ చెప్పేందుకు పోటీపడే కేడర్ కోసం సరికొత్త బొకేలు పలు రకాల డిజైన్లు, రంగురంగుల ఫ్లవర్స్ తో ఆకట్టుకుంటున్నాయి. ఏటా వినూత్నంగా బొకేలను తయారు చేస్తున్న తయారీదారులు ఏడాది పొలిటికల్ పార్టీలకు ప్రాధాన్యతను ఇచ్చాయి. పలు ప్రాంతాల నుంచి వివిధ రకాల రంగుల పుష్పాలను తెప్పించి బొకేలను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు రూ.500 నుంచి రూ. 10 వేల ఖరీదైన బొకేలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఫస్ట్ న్యూ ఇయర్ కావడంతో టీడీపీ జనసేన బీజేపీ అగ్ర నేతల ఫోటోలతో ఆయా పార్టీల జెండాలు అదే రంగుల పూలతో బొకేలు అందిస్తున్న తిరుపతిలోని బ్లూ పెటల్స్ పొలిటికల్ బొకేలు తయారు చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాహుల్ గాంధీ, మాజీ సీఎం జగన్ ఫోటోలు ఆయా పార్టీల గుర్తులతో బొకేలు రూపుదిద్దుకోగా పెద్ద ఎత్తున కేడర్ కూడా బొకేలను కొనుగోలు చేస్తుంది. ఈ మేరకు బిజినెస్ పెంచుకునే ప్రయత్నంలో నిర్వాహకులు రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, నేతలను దృష్టిలో పెట్టుకొని బొకేలను తయారు చేస్తున్నారు. రంగురంగుల పూలను బెంగళూరు, ఊటీ, థాయిలాండ్ వంటి ప్రాంతాల నుంచి తెప్పించిన బొకేల తయారీదారులు బిజినెస్ కూడా ఏడాది ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. తిరుపతిలోని బ్లూ పెటల్స్‌లో ఆకట్టుకుంటున్న పొలిటికల్ బొకేల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి