Andhra Pradesh: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావ్‌.. భార్యపై అనుమానంతో 9 నెలల పసిపాపను..

అనుమానం పెనుభూతమైంది.. తనకు పుట్టలేదన్న అనుమానంతో తొమ్మిది నెలల చిన్నారికి యాసిడ్‌ పోశాడో తండ్రి.. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయిన ఆ పాప అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయింది. మెరుగైన వైద్యం కోసం ఆ చిన్నారిని గుంటూరుకు తరలించారు. ఒంగోలు మండలం కరవది గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావ్‌.. భార్యపై అనుమానంతో 9 నెలల పసిపాపను..
Crime News
Follow us
Fairoz Baig

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 31, 2024 | 2:57 PM

అనుమానం పెనుభూతమైంది.. తనకు పుట్టలేదన్న అనుమానంతో తొమ్మిది నెలల చిన్నారికి యాసిడ్‌ పోశాడో తండ్రి.. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయిన ఆ పాప అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయింది. మెరుగైన వైద్యం కోసం ఆ చిన్నారిని గుంటూరుకు తరలించారు. ఒంగోలు మండలం కరవది గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు మన్యంజిల్లా పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు, లక్ష్మి దంపతులు వచ్చారు. పది రోజుల క్రితం వచ్చిన ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకున్నాడు భాస్కర్‌రావు. భార్యతో తరచూ గొడవలు పడేవాడు..

అయితే.. రొయ్యలకు వ్యాధులు రాకుండా ఉండేందుకు యాసిడ్‌ లాంటి పదార్ధం చెరువుల్లో వినియోగించేవారు. ఈ క్రమంలోనే.. ఈ యాసిడ్‌నే తొమ్మిది నెలల చిన్నారి వైష్ణవికి తాగించాడు భాస్కర్ రావు.. దీంతో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయిన ఆ చిన్నారి అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయింది. చిన్నారి ఏడుపు చూసి వెంటనే భార్య లక్ష్మి, చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని బిడ్డను ఏం చేశావంటూ తండ్రి భాస్కర్‌రావును ప్రశ్నించారు.

ఈ బిడ్డ తనకు పుట్టలేదని, తన ఊర్లో చాలా మంది తనకు చెప్పారంటూ భాస్కర్ రావు చెప్పాడు. అందుకే చంపేందుకు యాసిడ్‌ పోశానంటూ కర్కశంగా చెప్పాడు.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పాపను 108 వాహనంలో చిన్నారిని ఒంగోలు రిమ్స్‌ తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు.

భాస్కరరావుకు మొత్తం నలుగురు సంతానం కాగా చివరగా వైష్ణవి పుట్టింది. అల్లారుముద్దుగా ఉన్న ఆ చిన్నారి తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రి భాస్కర్‌రావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన భర్త ఇంత దారుణానికి పాల్పడతాడని తాను ఊహించలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనకు పుట్టలేదన్న అనుమానంతోనే చిన్నారికి యాసిడ్‌ తాగించానని భాస్కర్‌రావు ఎలాంటి పశ్చాతాపం లేకుండా చెబుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.. ఇంతటి దారుణానికి పాల్పడిన భాస్కర్ రావుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..