
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎపి ఎస్‌ఇసి) కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం నిజమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఏపీఎస్‌ఈసీ రమేష్ కుమార్ రాసిన లేఖ అందింది. మాకు తెలిసిన వివరాల ప్రకారం ఆయనే రాసినట్టు తెలుస్తోంది. రమేష్‌కుమార్‌కు భద్రత కల్పిస్తున్నాం. రమేశ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్నారని, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినప్పుడల్లా భద్రత కల్పిస్తారు. రమేష్‌కు భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నేను కూడా ఏపీ డీజీపీతో మాట్లాడతాను’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.