Vishaka Zoo: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. విశాఖ ‘జూ’కు కొత్త వన్యప్రాణులు..

Vishaka Zoo: ఇందిరాగాంధీ జూపార్కుకు(Indira Gandhi zoo park) వేరొక జూపార్కు నుంచి కొత్త వన్యప్రాణులను(Animals) తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్‌ నందినీ సలారియా తెలిపారు.

Vishaka Zoo: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. విశాఖ 'జూ'కు కొత్త వన్యప్రాణులు..
Vishaka Zoo
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 18, 2022 | 1:48 PM

Vishaka Zoo: ఇందిరాగాంధీ జూపార్కుకు(Indira Gandhi zoo park) వేరొక జూపార్కు నుంచి కొత్త వన్యప్రాణులను(Animals) తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్‌ నందినీ సలారియా తెలిపారు. ఇటీవల పంజాబ్‌లో ఛత్బీర్‌ జంతుప్రదర్శన శాల నుంచి కొన్నింటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు నిన్న మరికొన్ని వన్యప్రాణులు వచ్చాయి. జంతు మార్పిడి పద్ధతిపై ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు కొత్త వన్య ప్రాణులను అధికారులు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఈ నెల 13న చండీగఢ్‌లోని ఛత్బీర్‌ జూ పార్కు నుంచి మొసలి జాతికి చెందిన ఘరియల్స్‌(2 మగవి), రెడ్‌ జంగిల్‌ ఫౌల్స్‌(మగవి–2, ఆడవి–4), లెసర్‌ విజ్లింగ్‌ టీల్స్‌(మగది–1, ఆడవి–2), బార్న్‌ ఔల్స్‌(మగ–1, ఆడవి–2), హైనా( మగది–1) ఇక్కడకు తరలించటం జరిగింది.

తాజాగా..

తిరుపతి వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల నుంచి గురువారం సాయంత్రం గ్రే జంగిల్‌ పౌల్‌(మగ-1, ఆడది-2), వైల్డ్‌ డాగ్‌ (మగ-1, ఆడది-1) అడవి దున్న (ఆడది-1), చౌసింగ్‌ (మగ-1, ఆడది-1)లను విశాఖ జూకు తీసుకొచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక్కడి నుంచి హైనా, అడవిదున్న, నక్కలను తిరుపతి జూకు తరలించామన్నారు. వైల్డ్‌ డాగ్‌, అడవి దున్నల సంతతిని పెంచేందుకు ఇలాంటి కొత్త జాతులను ఇక్కడికి తీసుకువచ్చినట్లు క్యూరేటర్‌ పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన జంతువులను కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచిన తరువాత.. సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్లలోకి విడిచి పెట్టనున్నట్లు జూ అధికారులు తెలియజేశారు.

ఇవీ చదవండి..

Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..

Russia Ukraine War: ఉక్రెయిన్ లో రష్యా విధ్వంసంపై జెలెన్‌స్కీ వీడియో విడుదల.. హృదయ విదారక దృశ్యాలు..