Nellore Disha App: రాత్రి ఆటో ఎక్కిన యువతి, మారిన డ్రైవర్ ప్రవర్తన.. దిశ యాప్‌ ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగానే

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దిశ యాప్, నెల్లూరు జిల్లాలో యువతిని ఆటో డ్రైవర్ బారి నుంచి కాపాడింది. ఆటో డ్రైవర్...

Nellore Disha App: రాత్రి ఆటో ఎక్కిన యువతి, మారిన డ్రైవర్ ప్రవర్తన.. దిశ యాప్‌ ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగానే
Disha App
Follow us

|

Updated on: Jul 26, 2021 | 9:35 AM

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దిశ యాప్, నెల్లూరు జిల్లాలో యువతిని ఆటో డ్రైవర్ బారి నుంచి కాపాడింది. ఆటో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంటనే మొబైల్‌లోని దిశ యాప్ ఎస్‌ఓఎస్ బటన్ ఆన్ చేయడంతో కేవలం రెండు నిమిషాల్లోనే పోలీసులు యువతి వద్దకు వచ్చి ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చారు. యువతిని క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులను గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ అభినందించారు. ఆయనే కాదు నెల్లూరు జిల్లా ప్రజలు సైతం పోలీసుల సేవలను కొనియాడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే… నెల్లూరు జిల్లా దొరవారిసత్రం పోలీసులు, దిశ యాప్‌ సాయం కోరిన యువతిని క్షేమంగా ఇంటికి చేర్చారు. సూళ్లూరుపేట సమీపంలోని శ్రీసిటీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి సొంత ఊరు మార్కాపురం వెళ్లి తిరిగి వస్తుండగా నాయుడుపేట నుంచి సూళ్లూరుపేట వెళ్లేందుకు రాత్రి పదిన్నర సమయంలో హైవేపై వెళ్తున్న ఆటో ఎక్కింది. అయితే ఆటో బయలుదేరిన కాసేపటికే డ్రైవర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అనుమానం రావడంతో దిశ యాప్‌లో ఎస్‌ఓఎస్ బటన్ ఆన్ చేసింది ఆ యువతి. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. 10.38 గంటలకు సమాచారం అందుకుని 10.40 గంటలకు బాధిత యువతితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారిసత్రం పోలీసులు, హైవే మొబైల్‌ సిబ్బంది 10.42 గంటలకు యువతి వద్దకు చేరుకుని ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని సురక్షితంగా సూళ్లూరుపేట తీసుకొచ్చి బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు హైవేలో ప్రయాణిస్తున్న ఆటో వద్దకు చేరుకుని యువతిని క్షేమంగా ఇంటికి చేర్చారు. దిశ యాప్ ఉపయోగాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలని, అలాగే ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ. మహిళలు ఎవరు అధైర్య పడొద్దని, మహిళలకు పోలీసులు ఎప్పుడు అండగా ఉంటారని ఉద్ఘాటించారు.  అటు ప్రభుత్వం కూడా దిశ యాప్‌ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ప్రతీ యువతి, మహిళ దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది.

Also Read:తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కీలక హెచ్చరిక చేసిన టీటీడీ

ఉప్పొంగిన అభిమానం.. హీరో విజయ్‌‌పై తమ ప్రేమను చాటుకున్న కర్నాటక ఫ్యాన్స్.. నిలువెత్తు విగ్రహం

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?