Nellore News: కొత్త జిల్లాల వివాదం.. ఆ క్రెడిట్ నాదంటే నాదే.. సోమిరెడ్డి – కాకాని మధ్య మాటల తూటాలు
నెల్లూరు జిల్లాలోని ఫైర్ పెయిర్ మళ్లీ చెలరేగిపోతున్నారు.. పుష్ప సినిమాలోని డైలాగ్ లాగా తగ్గేదే లే.. అంటున్నారు.. ఈ పాటికే ఆ ఇద్దరూ ఎవరో అర్ధమయ్యే ఉంటుంది.. ఎస్.. వాళ్లే .. మాజీమంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి..
SOMIREDDY VS KAKANI: ఏపీలో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్.. ఇటు సొంతపార్టీలో గ్రూప్ పాలిటిక్స్ నుంచి.. ప్రత్యర్థి పార్టీ దాకా వార్ మామూలుగా ఉండదు.. నెల్లూరు జిల్లా(Nellore District) మొత్తం మాట అలా ఉంచితే ఆ ఒక్క నియోజకవర్గం ఉంది చూడండి.. ఎప్పుడూ ఆరని రావణ కాష్టం అంటే ఎంటో అక్కడ చూడొచ్చు.. తెలుగు దేశం పార్టీ(TDP) చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.. ఒకరు నిప్పు.. మరొకరు ఉప్పు.. మీడియా ముందుకు వస్తే టిడిపి, వైసిపి అధినేతలైనా ఒకరిపై ఒకరు విమర్శలు చేయని సందర్భాలు ఉంటాయి.. కానీ ఈ ఇద్దరు మాత్రం మీడియా ముందుకు వచ్చేది ఒకరిపై ఒకరు సెటైర్లు వేయడానికే అన్నట్టుగా ఉంటుంది. మినిమమ్ ఒన్ మినిట్ బైట్ అయినా కనీసం రెండు మూడు మాటలు ప్రత్యర్థి గురించి టచ్ చేయాల్సిందే.. ఆరోపణలు చేయడానికి పలానా సందర్భం అంటూ అక్కర్లేని ఫైర్ పెయిర్ .. తాజాగా ఏపీలో జిల్లాల విభజన అంశం.. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దానికి కారణమైంది.
తిరుపతి పార్లమెంట్ కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది. ఇదే లోక్ సభ పరిధిలో సర్వేపల్లి నియోజకవర్గం కూడా ఉంది. లోక్ సభ పరిధిలో ఉన్న సర్వేపల్లి నెల్లూరు నగరానికి మూడు వైపులా ఉంది. దీంతో నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం వద్ద పట్టుబట్టి సాధించామని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో కాకాని గొప్పతనం ఏమీ లేదంటున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టిలో పెట్టడం వల్లే సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కొనసాగించడం సాధ్యపడిందని ఆయన అంటున్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కాకాని. బాల నాగమ్మ సినిమా లోని తిప్పడు పాత్రతో పోల్చి సోమిరెడ్డి పై సెటైర్ వేశారు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగడం తన క్రెడిట్‌గా సోమిరెడ్డి మాట్లాడటం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు.
– మురళి, టీవీ9 తెలుగు, నెల్లూరు జిల్లా
Also Read..