Police Beat: మాస్కు ధరించకపోతే కాలితో తన్నాలా.? తీవ్ర విమర్శలకు దారి తీస్తోన్న నెల్లూరు ఎస్‌ఐ తీరు..

|

Jul 31, 2021 | 8:00 AM

Police Beat: ఓవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంభిస్తున్నామని.. పోలీసులు ప్రజలతో స్నేహంగా ఉండాలని అధికారులు చెబుతుంటారు. కానీ కొందరి పోలీసుల తీరు మాత్రం దీనికి...

Police Beat: మాస్కు ధరించకపోతే కాలితో తన్నాలా.? తీవ్ర విమర్శలకు దారి తీస్తోన్న నెల్లూరు ఎస్‌ఐ తీరు..
Police Beats For No Musk
Follow us on

Police Beat: ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంభిస్తున్నామని.. పోలీసులు ప్రజలతో స్నేహంగా ఉండాలని అధికారులు చెబుతుంటారు. కానీ కొందరి పోలీసుల తీరు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంటుంది. ఒక వ్యక్తిని కొట్టే అధికారం ఎవరికీ ఉండదు. కానీ శాంతి భద్రతలను సంరక్షించేందుకు గాను పోలీసులకు మాత్రం దండించే అధికారం ఉంది. అది కూడా షరతులతో కూడుకున్నదే. కానీ కొందరు మాత్రం చట్టాన్ని తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎస్‌ఐ చేసిన నిర్వాకం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా.? అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా చేజర్ల ఎస్‌ఐ మహ్మద్‌ హనీఫ్‌.. అందూరుపల్లి సెంటర్‌లో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలోనే నోటికి మాస్కు ధరించకుండా అటుగా వెళుతోన్న ఓ వ్యక్తి ఎస్‌ఐ కంటపడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన హనీఫ్‌.. సదరు వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. మాస్కు ఎందుకు పెట్టుకోలేదని కాలితో తన్నారు. అంతటితో ఆగకుండా చొక్కా పట్టుకుని తన్నుతూ కారులో తీసుకెళ్లారు. దీనంతటినీ అక్కడే ఉన్న స్థానికుడు మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కేవలం మాస్కు లేదన్న కారణంగా ఇంతలా దండించాలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి ఆ వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించినా ఓ పోలీసు అధికారి స్పందించాల్సిన తీరు ఇది కాదని మరికొందరు వాదిస్తున్నారు.

 

Also Read: Black magic: ఆ గ్రామంలో అడుగు బయటపెట్టని జనం.. క్షుద్రపూజల కలకలం.. రాత్రిళ్లు కోళ్లు బలి

Credit Score: మీరు క్రెడిట్‌ కార్డు.. రుణాలు తీసుకున్నారా..? మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపే అంశాలివే..!

Cyber Crime: ఏకంగా తెలంగాణ డీజీపీ ఫొటోతోనే చీటింగ్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు