Naga Chaitanya: సిక్కోలు తీరంలో చైతూ సందడి.. మత్స్యకారుల కుటుంబాలతో భేటీ.. ఎందుకంటే..?

నాడు.. మత్స్యలేశం గంగపుత్రుల వ్యథపై టీవీ9 స్పెషల్‌ ఫోకస్‌ చేస్తే.. నేడు.. వారిపై.. పాన్‌ ఇండియా మూవీకి గీతా ఆర్ట్స్ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. మత్య్సకారుల జీవన ముఖ చిత్రం ఇతి వృత్తంగా తెరకెక్కుతున్న సినిమా కోసం... హీరో అక్కినేని నాగ చైతన్య సిక్కోలు తీరం వెళ్లారు. మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు.. నాగచైతన్య, డైరెక్టర్‌ చందు మొండేటి, బన్నీ వాసు వెళ్లారు. ఈ క్రమంలో చైతూను చూసేందుకు స్థానికులు పోటెత్తారు.

Naga Chaitanya: సిక్కోలు తీరంలో చైతూ సందడి.. మత్స్యకారుల కుటుంబాలతో భేటీ.. ఎందుకంటే..?
Naga Chaitanya in Srikakulam
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 03, 2023 | 9:26 PM

శ్రీకాకుళం, ఆగస్టు 3: ఏడాదిగా పాకిస్థాన్‌ జైల్లో మన మత్స్యకారుల క్షోభను.. వారి కోసం ఎదురుచూస్తూ… కుటుంబ సభ్యులు అనుభవించిన నరకాన్ని.. ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది టీవీ9.. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశంలోని గంగపుత్రుల వ్యథపై.. గతంలో టీవీ9… అనగనగ ఒక ఊరులో.. ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. నాడు మత్స్యకారుల వ్యథపై.. టీవీ9 ఫోకస్‌ పెడితే.. నేడు పాన్‌ ఇండియా మూవీకి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ అయ్యింది. మత్య్సకారుల జీవన ముఖ చిత్రం ఇతి వృత్తంగా తెరకెక్కుతున్న సినిమా కోసం… హీరో అక్కినేని నాగ చైతన్య సిక్కోలు తీరం వెళ్లారు. ప్రేమమ్, సవ్యసాచి వంటి చిత్రాల తర్వాత… హీరో నాగచైతన్య, డైరెక్టర్‌ చందు మొండేటి కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కనుంది.. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాకుళం, గుజరాత్‌ నేపథ్యంలోని జాలర్ల జీవితాలను ఆవిష్కరించేలా ఈ ఫిల్మ్ స్టోరీ ఉంటుంది. ఇందులో నాగచైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారు. అందుకే జాలర్లను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు నాగచైతన్య, చందు మొండేటి, బన్నీ వాసు వెళ్లారు.

కె.మత్స్య లేశం గ్రామంలో నాగ చైతన్య చాలా సేపు గడిపారు. పాక్ చెరలో బందీ అయ్యి 2020లో విడుదలై వచ్చిన G.రామారావు ఇంటికి వెళ్లారు. రామారావు ఇంటి మేడపై నుండి గ్రామాన్ని పరిశీలించారు. అక్కడే భోజనం చేసి మత్స్యకారులతో మాట్లాడారు. మూడు రోజుల పాటు శ్రీకాకుళంలోని మత్స్యకార గ్రామాల్లోనే నాగచైతన్య ఉండనున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. మత్స్యకారులతో కలిసి సముద్రంపై చేపలవేటకు సైతం వెళ్లనున్నారు. వారి దినచర్యను అణువణువు పరీశీలించనున్నారు. సినిమాను సహజంగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో మత్స్యకారులతో కలిసి కొన్ని రోజుల పాటు నాగ చైతన్య, డైరెక్టర్ చందు మొండేటి మత్స్యకార గ్రామాల్లోనే కలియ తిరగనున్నారు.

2018 సంవత్సరంలో గుజరాత్‌‌లోని వెరావల్‌ నుంచి చేపలు పట్టేందుకు వెళ్లి… పాక్‌ కోస్ట్‌ గార్డ్‌కు చిక్కిన 21 మంది జాలర్లలో ఒకరైన రామారావు లైఫ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. జాలర్ల వలసలు, పాక్ అధికారులకు చిక్కడం అక్కడి నుంచి ఇండియాకు రావడం వంటి స్టోరీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య… గణగల్ల రామరావు క్యారెక్టర్‌‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ మూవీకి ‘తండెల్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్‌. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్‌ అని పిలుస్తారట. మరోవైపు.. నాగచెతన్యను చూసేందుకు ఫ్యాన్స్‌ తరలివచ్చారు. ఆయనతో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.