Nara Lokesh Padayatra: ఆరవ రోజుకు చేరుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర.. నేటి యాత్ర వివరాలివే..

| Edited By: Anil kumar poka

Feb 01, 2023 | 3:39 PM

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటికే 58.5 కిలోమీటర్లు నడిచిన లోకేష్ యువగళం పాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది.

Nara Lokesh Padayatra: ఆరవ రోజుకు చేరుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర.. నేటి యాత్ర వివరాలివే..
Nara Lokesh
Follow us on

టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇప్పటికే 58.5 కిలోమీటర్లు నడిచిన లోకేష్ యువగళం పాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది. మరి ఇవాళ్టి యాత్రలో షెడ్యూల్ ఏంటి.? ఎక్కడ నుంచి ఎక్కడి వరకు సాగనుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర ఆరవ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం క‌మ్మన‌ప‌ల్లె స‌మీపంలోని క‌స్తూరిబా స్కూల్ విడిది కేంద్రం నుంచి పాద‌యాత్ర ప్రారంభమవుతుంది. 10గంటల 20నిముషాలకు బెల్లుపల్లి క్రాస్ దగ్గర వాల్మీకి సామాజిక‌వ‌ర్గం నేతలతో స‌మావేశమవుతారు. 11గంటల 50నిముషాలకు కొలమసానిపల్లె పెట్రోలు బంకు సమీపంలో మహిళలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గొల్లపల్లి సమీపంలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 5గంటల 45 నిముషాలకు గొల్లపల్లి సమీపంలో ఎస్సీ ప్రముఖులతో భేటీ ఉంటుంది. ఇక 6గంటల 30నిముషాలకు రామాపురంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో బస చేస్తారు.

నిన్న పలమనేరు నియోజకవర్గంలోని కస్తూరి నగరం దగ్గర పండ్ల వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, భూకబ్జాలు తప్ప స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్‌కు అభివృద్ధి పట్టదంటూ విమర్శలు చేశారు. బైరెడ్డిపల్లిలో కురబ సామాజిక వర్గంతో లోకేష్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యే సొంతూరుకు వెళ్లే రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టానన్నారు లోకేష్. 5వరోజు 14.9 కిలోమీటర్ల దూరం లోకేష్ నడిచారు. ఇప్పటివరకు 58.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..