Andhra Pradesh: కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. డాక్టర్లు స్కాన్ చేసి చూడగా..

ఓ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆమెను స్కాన్ చేసిన డాక్టర్లు.. వచ్చిన రిపోర్టులు చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. ఇంతకీ అసలేం జరిగింది.?

Andhra Pradesh: కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన బాలిక.. డాక్టర్లు స్కాన్ చేసి చూడగా..
Doctor
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2023 | 9:15 AM

ఓ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆమెను స్కాన్ చేసిన డాక్టర్లు.. వచ్చిన రిపోర్టులు చూసి దెబ్బకు ఖంగుతిన్నారు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ మధ్యకాలంలో తరచూ చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఆ కోవకు చెందినది ఈ ఘటన కూడా.. కొందరికి సుద్దముక్కలు, మట్టి, బియ్యం తినడం అలవాటైతే.. ఈ బాలిక జుట్టును తినడం అలవాటు చేసుకుంది. పదేళ్లుగా జుట్టును తినడమే అలవాటుగా మార్చుకుంది. తద్వారా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడున్న డాక్టర్లు స్కాన్ చేసి చూడగా ఆమె కడుపులో కిలోకి పైగా జుట్టు ఉండటాన్ని గుర్తించారు. ఇక వాళ్లు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని కడుపులో నుంచి బయటకు తీసి బాలికకు పునర్జన్మను అందించారు. కాగా, ఈ అరుదైన శస్త్రచికిత్స ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడలో జరిగింది. ఈ అరుదైన వ్యాధి లక్షల్లో ఒకరికి ఉంటుందని.. దీన్ని ట్రైకో బీజోర్ అని అంటారని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఆపరేషన్ అనంతరం బాలిక ఆరోగ్యం కుదుటపడిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..