ఎన్నికల కసరత్తు వేగవంతం చేసిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు…నియోజకవర్గాల వారీగా ఇంచార్జులతో సమావేశమవుతున్నారు.ఒక్కో ఇంచార్జి యొక్క పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు…ఆ నివేదికల ఆధారంగా వారితో వన్ టు వన్ మీటింగ్ లు నిర్వహిస్తున్నారు.పనితీరు బాగోలేని ఇంచార్జిల స్థానంలో పలువురు కొత్తవారిని నియమిస్తూ వస్తున్నారు.తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధిగా తంగిరాల సౌమ్యను ప్రకటించారు చంద్రబాబు.
తంగిరాల సౌమ్య 2019 కు ముందు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసారు.2014 ఎన్నికల్లో తన తండ్రి ప్రభాకరరావు హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆ తర్వాత 2019 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొండితోక జగన్మోహన్ రావుపై ఓడిపోయారు.ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసమస్యల పట్ల పోరాటాలు చేస్తున్నారు తంగిరాల సౌమ్య.దీంతో నివేదికల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో నందిగామ ఎమ్మెల్యే అభ్యర్ధిగా సౌమ్య ఉంటుందని అధినేత చంద్రబాబు ప్రకటించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మొండితోక జగన్మోహన్ రావు నియోజవకవర్గం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆ తర్వాత ఆయన తమ్ముడు అరుణ్ కుమార్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం జగన్..ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ముల్లో ఒకరు ఎమ్మెల్యేగా,మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు..ఈ ఇద్దరినీ ఎదుర్కొని బరిలో నిలబడాలంటే సౌమ్యకు ఒకింత కష్టం తప్పదని చెప్పాలి.అయితే మొండితోక బ్రదర్స్ పై చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నారు సౌమ్య.అంతెందుకు మొండితోక బ్రదర్స్ ను వసూల్ బ్రదర్స్ అంటూ కామెంట్స్ చేయడం…ఆ తర్వాత ఒకరికొకరు సవాళ్లు విసిరికోవడం…ఇలా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతుంది.అయితే టీడీపీకున్న బలమైన కేడర్ తో ఖచ్చితంగా మళ్లీ పసుపు జెండా ఎగురవేస్తానంటున్నారు సౌమ్య.
అటు అధికార పార్టీ నమ్ముకున్న అభివృద్దితో మళ్లీ వైసీపీదే సీటు అంటున్నారు మొండితోక జగన్మోహన్ రావు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య జరిగిన అభివృద్దిని చూపిస్తూ వైసీపీ ప్రజల్లోకి దూసుకెళ్తుంటే…ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల అవినీతి తన ప్రధాన అస్త్రం అంటున్నారు తంగిరాల సౌమ్య. తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన కొద్ది మందిలో తంగిరాల సౌమ్య కూడా ఒకరు.మరి తంగిరాల సౌమ్య వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా…?అధఇకార పార్టీని ఢీకొంటారా అనేది చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..