AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముచ్చుమర్రి మిస్టరీ.. వారమైనా లభించని బాలిక ఆచూకీ.. ముప్పుతిప్పలు పెడుతున్న మైనర్లు..

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఈ కేసులో అరెస్టైన మైనర్లు రోజుకో మాట మార్చడంతో చిన్నారి డెడ్‌బాడీ ఆచూకీ పోలీసులకు సవాల్‌గా మారింది. బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడంతో పోలీసులు చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

ముచ్చుమర్రి మిస్టరీ.. వారమైనా లభించని బాలిక ఆచూకీ.. ముప్పుతిప్పలు పెడుతున్న మైనర్లు..
Nandyal Muchumarri Girl Incident
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2024 | 5:27 PM

Share

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఈ కేసులో అరెస్టైన మైనర్లు రోజుకో మాట మార్చడంతో చిన్నారి డెడ్‌బాడీ ఆచూకీ పోలీసులకు సవాల్‌గా మారింది. బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడంతో పోలీసులు చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అన్ని చోట్ల గాలిస్తున్నారు. ఇప్పటికే.. మైనర్లు చెప్పిన కాలువలు, చెరువులు, శ్మశానాల్లోనూ గాలించారు. అయినా బాలిక మృతదేహం ఆచూకీ లభించడంలేదు. కాగా.. చిన్నారి అత్యాచారం ఘటనను ఖండిస్తూ ఆత్మకూరు పట్టణంలో విద్యార్థి నాయకులు ధర్నాకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

ఇదిలాఉంటే.. నంద్యాల జిల్లా మచ్చుమర్రి బాలిక హత్య ఘటనపై సీరియస్‌ అయ్యారు ఏపీ హోం మినిస్టర్‌ అనిత. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆమె… ఇలాంటి ఘటనలపై స్పెషల్ కోర్టు ఏర్పాటుకు సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..?

ఈ నెల 7న పార్క్‌లో ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్లు ఎత్తికెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను చంపేసి మృతదేహం దొరక్కుండా చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిమ్మకాయలను పడేశారు.. క్షుద్రపూజలు జరిగినట్లు సీన్ క్రియేట్ చేశారు. అయితే ఘటన జరిగి వారం దాటినా బాలిక మృతదేహానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ ఇంకా దొరకలేదు. కేసులో అరెస్టైన మైనర్లు పోలీసులకు పొంతనలేని సమాధానం చెబుతున్నారు. బాలికను చంపి ఎక్కడ పడేశారు అని అడిగితే… రోజుకో ప్లేస్‌ చెబుతూ పోలీసులను తిప్పలు పెడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకూ ఇప్పటివరకు ఎలాంటి క్లూ దొరకలేదు. మరోవైపు బాలిక మృతదేహాం కోసం మచ్చుమర్రిలో ఆందోళనలు మిన్నంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?