AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కాటికి పోయే వయస్సులో ఇదేం పనిరా..! భార్య డెడ్‌బాడీతో రెండు రోజులు..

మృతురాలు వెంకటలక్ష్మమ్మ మొహం గుర్తించలేని విధంగా ఉంది. తల భాగం నుజ్జు నుజ్జు అయ్యే విధంగా గొడ్డలితో కొట్టి అతి క్రూరంగా హత్య చేసి ఉండడంతో .. వెంకట లక్ష్మమ్మ హత్యకు మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత 3 రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Andhra: కాటికి పోయే వయస్సులో ఇదేం పనిరా..! భార్య డెడ్‌బాడీతో రెండు రోజులు..
Ap Crime News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 9:49 AM

Share

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలోని బాయి గడ్డ వీధిలో దారుణం చోటుచేసుకుంది. భార్య వెంకట లక్ష్మమ్మ (65 ) ను భర్త వెంకన్న (70) దారుణంగా గొడ్డలితో హత్య చేశాడు. హత్య అనంతరం భార్య మృతదేహం వద్దనే రెండు రోజులు పాటు ఇంట్లోనే ఉన్నాడు. మృతదేహం నుండి దుర్వాసన వస్తుండడంతో ఇంటికి తాళం వేసి పరారీ అయ్యాడు భర్త వెంకన్న.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వక పోవడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఓడిగట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను హత్య చేసిన వెంకన్న భార్య మృతదేహంతో రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడనీ.. దుర్వాసన వస్తుండడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంటి నుండి దుర్వాసన వస్తుండడం.. రోజూ కనిపించే వెంకటలక్ష్మి కనిపించకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించగా దారుణమైన సీన్ కనిపించింది.. తీవ్ర దుర్వాసనతోపాటు.. రక్తపుమడుగులో కుళ్లిపోయిన స్థితిలో వెంకటలక్ష్మమ్మ మృతదేహం కనిపించింది.

మృతురాలు వెంకటలక్ష్మమ్మ మొహం గుర్తించలేని విధంగా ఉంది. తల భాగం నుజ్జు నుజ్జు అయ్యే విధంగా గొడ్డలితో కొట్టి అతి క్రూరంగా హత్య చేసి ఉండడంతో .. వెంకట లక్ష్మమ్మ హత్యకు మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత 3 రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. వెంకన్న తరచూ భార్యతో గొడవపడేవాడని మృతురాలి పెద్ద కుమారుడు ఆంజనేయులు అన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా మృతురాలు వెంకటలచ్చమ్మ కు ముగ్గురు కుమార్తెలు , ఇద్దరు కుమారులు ఉన్నారు . కుమార్తెలు ముగ్గురికి వివాహం చేసి అత్తగారింటికి పంపగా.. ఇద్దరి కుమారులకు సైతం వివాహాలయ్యాయి . పెద్ద కుమారుడు నంద్యాలలో నివసిస్తుండగా రెండవ కుమారుడు ఆర్మీలో ఢిల్లీలో పనిచేస్తున్నారు. వెంకట లక్ష్మమ్మ భర్త వెంకన్నతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు . వెంకన్న గొర్రెలు కాపరిగా ఉంటుండగా భార్య వెంకట లక్ష్మి వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు.

మద్యం అలవాటు ఉన్న వెంకన్న భార్యతో తరచూ గొడవ పడేవాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యను తరచూ వేధించేవాడని స్థానికులు అంటున్నారు. మద్యానికి బానిస కావడంతో పాటు భార్యపై అనుమానం కూడా పెంచుకున్న వెంకన్న ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. ప్రశాంతంగా ఉండాల్సిన ఈ వయసులో వెంకన్న ఈ దారుణానికి పాల్పడడంతో టెంపుల్ విలేజ్ ఐన నందవరం గ్రామం ఒకసారి గా ఉలికిపాటుకు గురి అయింది. స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us