AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో

విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో ఓ కుటుంబానికి ఊహించని షాక్ ఎదురైంది. వంటగదిలో ఏదో కదులుతున్నట్లు గుర్తించిన మహిళ దగ్గరకు వెళ్లి చూడగా.. భారీ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో
King Cobra Snake
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 8:22 AM

Share

విశాఖలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్.. కుటుంబమంతా తమ పనుల్లో నిమగ్నమై ఉంది.. ఇంట్లోని మహిళ కిచెన్ రూమ్ లోకి వెళ్ళింది. ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. కాస్త దగ్గరకు వెళ్లి చూస్తే.. గుండెపట్టుకునేంత పనైంది. అక్కడ ఉన్నది ఏంటో తెలుసా.. భారీ నాగుపాము. భుసలు కొడుతూ పడగ విప్పి పైకి వచ్చే ప్రయత్నం చేసింది. దీంతో పరుగులు తీశారు కుటుంబ సభ్యులు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సెక్టర్ 9.. క్వార్టర్ నెంబర్ 201. ఓ ఇల్లు.. రోజువారి మాదిరిగానే కుటుంబసభ్యులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఓ మహిళ కిచెన్ రూమ్‌కు వెళ్లారు. లోపలికి వెళ్ళగానే ఆమెకు షాకింగ్ సీన్ కనిపించింది. తేరుకునే లోపే ప్రాణం పోయేంత పనైంది. బయటకు ఒక్కసారిగా పరుగులు తీసి డోర్ లాక్ చేశారు. ఏమిటాని ఆరాతీస్తే లోపల భారీ నాగుపాము కనిపించింది. పడగ విప్పి బుసలు కొడుతోంది.

వెంటనే.. స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కిరణ్ కుమార్.. ఆ పాము కోసం కిచెన్ లోకి వెళ్ళాడు. అప్పటికే ఆ పాము ఫ్రిడ్జ్ వెనుక వైపు తిష్ట వేసి కూర్చుంది. కిరణ్ కుమార్ వెళ్లి ఫ్రిడ్జ్ తీసేసరికి… భారీగా పడక విప్పి భుసలు కొడుతోంది. చాకచక్యంగా పామును రెస్క్యూ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

కాగా.. నాగుల పంచమి ఒక రోజు నాగుపాము దర్శనమివ్వడంతో.. కుటుంబసభ్యులు దేవుడి మహిమగా భావించి దండంపెట్టుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..