Anna Canteen: అక్కడి టీడీపీ నేతల ముందుచూపు.. అన్న క్యాంటీన్‌ బియ్యం కోసం వరి సాగు

Vijayawada: అన్న క్యాంటీన్‌ నిర్వహణలో బియ్యానికి లోటు రావొద్దని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ. ఎకరాల కొద్ది పంట పొలాలు సిద్ధం వరినాట్లు వేసింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ టీడీపీ నేతలు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Anna Canteen: అక్కడి టీడీపీ నేతల ముందుచూపు.. అన్న క్యాంటీన్‌ బియ్యం కోసం వరి సాగు
Anna Canteen

Updated on: Sep 06, 2022 | 7:53 AM

Vijayawada: అన్న క్యాంటీన్‌ నిర్వహణలో బియ్యానికి లోటు రావొద్దని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ. ఎకరాల కొద్ది పంట పొలాలు సిద్ధం వరినాట్లు వేసింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ టీడీపీ నేతలు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదోడి కడుపు నింపే అన్యా క్యాంటీన్‌ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా వరి పంట సాగు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆకలితో అలమటించే వారి కడుపు నింపడమే లక్ష్యంగా గత కొన్నాళ్లుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3 ఎకరాల 75 సెంట్లలో వరి పంట సాగు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు పొలాల్లోకి దిగి స్వయంగా వరినాట్లు వేశారు.

కాగా పంటలో వచ్చే క్వింటాళ్ల ధాన్యాన్ని మొత్తం అన్న క్యాంటీన్‌కే వినియోగించనున్నారు. ఇక అన్న క్యాంటీన్‌లపై వైసీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల దాడులకు దిగుతున్నారని.. ఇదే మాత్రం సరికాదన్నారు టీడీపీ నేతలు. పేదోళ్లకు పిడికెడు అన్నం పెడితే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కొద్దిరోజుల కిందట కుప్పంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత గుంటూరు తెనాలిలో అన్న క్యాంటీన్‌ ఎత్తివేయాలని మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఈనేపథ్యంలో నందిగామలో టీడీపీ చేసిన కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..