Viral video: చూస్తుండగానే క్షణంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ దృశ్యాలు..
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, వ్యాను ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లా శివారు పార్థసారధినగర్ సమీపంలో ఉపాధ్యాయులతో వెళ్తున్న వ్యాను ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలవైపున వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరి దూరంగా పడిపోయారు, బైకు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇక వ్యానులోని వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా.. బైక్‌పైన వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వ్యానులో ప్రయాణిస్తున్నవారంతా ముత్తుకూరు మండలం ఈపురు వెంకన్నపాలెం స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో నెట్టింట చేరి హల్‌చల్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

