Nandigama: నందిగామ వద్ద కలకలం.. ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో పొగలు…
విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు నందిగామ హైవే వద్దకు రాగానే ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తిగా బస్సును రోడ్డు పక్కన ఆపాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

Apsrtc Bus Smoke (representative image)
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. విజయవాడ నుంచి కోదాడకు వెళ్తున్న బస్సు నందిగామ హైవే వద్దకు చేరుకునే సరికి ఇంజిన్ భాగం నుంచి పొగలు కక్కడం ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన ఆపి, లోపలున్న 15 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాత మరో బస్సు ద్వారా వారిని గమ్యస్థానానికి పంపించారు. ఇంధన లీకేజీ కారణంగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయని డ్రైవర్ తెలిపాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
