AP News: విజయవాడలో బెంగాలీ మాట్లాడుతూ కనిపించిన వ్యక్తి.. అనుమానమొచ్చి ఆరా తీయగా

కృష్ణా జిల్లాలో బెంగాలీ మాట్లాడుతూ కనిపించాడు ఓ వ్యక్తి. అతడు ఎక్కడ నుంచి వచ్చాడు.? ఎవరు.? అన్నది ఏ వివరాలు తెలియవు. పోలీసులు ఎంక్వయిరీ చేశారు. తీరా విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. ఇంతకీ అదేంటంటే.. ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

AP News: విజయవాడలో బెంగాలీ మాట్లాడుతూ కనిపించిన వ్యక్తి.. అనుమానమొచ్చి ఆరా తీయగా
Representative Image 1

Edited By: Ravi Kiran

Updated on: Jan 31, 2025 | 3:20 PM

2013వ సంవత్సరంలో నాగాయలంక మండలం నాచుగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తి గురించి అప్పటి వీఆర్వో ద్వారా నాగాయలంక పోలీస్‌లకు సమాచారం రాగా.. అక్కడికి వెళ్లి అతనిని విచారించారు. అతను పేరు ఎండీ ఉద్దీన్.. ఊరు బంగ్లాదేశ్ అని చెప్పటంతో.. అతడు బంగ్లాదేశ్ జాతీయుడని తెలుసుకుని అతని వద్ద దేశంలోకి రావడానికి ఏమైనా పర్మిషన్ ఉందా అని అడగటంతో ఆ వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. దేశంలోకి అక్రమంగా చొరబడినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం అతన్ని కోర్టు ఎదుట హాజరుపరచగా.. అతడికి కోర్టు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆ వ్యక్తి శిక్ష అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు నాగాయలంక పోలీస్ స్టేషన్ వద్దకు పంపారు.

అప్పటి నుంచి సుమారుగా పోలీస్ స్టేషన్‌లోనే 10 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి నివసిస్తూ తన కుటుంబ సభ్యుల జాడ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. అయితే ఆ విషయాలు ఎక్కడా కూడా సాధ్యం కాలేదు. నాగాయలంక పోలీస్ స్టేషన్‌కు సుబ్రహ్మణ్యం ఎస్సైగా ఉన్న టైంలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాల కోసం ప్రయత్నించారు. అయితే ఏ విషయమూ తెలియలేదు. ఇక ఇప్పటి స్టేషన్ ఎస్సై రాజేష్.. సదరు వ్యక్తి ఫోటోను ఫేస్‌బుక్‌, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతడి బంధువులు ఆ ఫోటోను గుర్తించి.. నాగాయలంక పోలీస్ అధికారులను సంప్రదించాడు. అతడు తన బంధువు అని తెలిపాడు. ఇన్నేళ్లుగా అతడ్ని కుటుంబసభ్యులతో కలపాలన్న కోరిక నెరవేరిందని ఎస్సై రాజేష్. కాగా, కృష్ణా జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు బంగ్లాదేశ్ బార్డర్ వద్ద అతన్ని బంధువులకు ఆప్పగించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి