Mutton Scam: మటన్ బిర్యానీ కమ్మగా ఉందని కుమ్మేస్తున్నారా? ఈ షాకింగ్ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Mutton Scam: మటన్ అంటే ఇష్టపడని నాన్‌వెజ్ ప్రియులు ఉండరు. ముక్కలేనిదే నోట్లో ముక్కదిగదంటూ భీష్మించేవారు కూడా ఉంటారు.
Mutton Scam: మటన్ అంటే ఇష్టపడని నాన్‌వెజ్ ప్రియులు ఉండరు. ముక్కలేనిదే నోట్లో ముక్కదిగదంటూ భీష్మించేవారు కూడా ఉంటారు. అయితే ఎంతో ఇష్టంగా మీరు తినే మటన్ అసలు ఎక్కడ నుండి సరఫరా అవుతుందో ఎప్పుడైనా గుర్తించారా?.. ఆ మటన్ తింటే మీరు మటాష్ అని మీకు తెలుసా?.. అసలు ఈ మటన్ కథేంటో.. టీవీ9 నిఘా ఆపరేషన్‌లో వెలుగుచూసిన సంచలన నిజాలేంటో మీరే చూడండి..
మటన్ బిర్యాని, మటన్ సూప్, మటన్ కుర్మ ఇలా మటన్‌తో చేసిన వంటకాల పేర్లు వింటేనే ఎవరికైనా నోరురాల్సిందే. ఆదివారం వచ్చిందంటేచాలు చాలమంది ఇళ్లలో మటన్ కూర వాసన గుమగుమలు ఆడాల్సిందే. అయితే, మనం ఎంతో ఇష్టంగా తినే మటన్ ముక్క.. మన ఆరోగ్యాన్ని నిలువునా ముంచేస్తుంది. అవును.. హోటల్స్, దాబాల్లో లొట్టలు వేసుకునే తినే నాన్‌వెజ్ వంటకాలకు మటన్ ఎక్కడినుండి వస్తుందోఎప్పుడైనా ఆరా తిరసారా?.. అసలు ఆ నాన్‌వెజ్ ఎంత సేఫ్?.. ఎంత తాజా?.. అనేది ఎప్పుడైనా గుర్తించారా? అయితే గుంటూరు జిల్లా మంగళగిరి కభేల కేంద్రగా జరుగుతున్న దందా వివరాలు తెలిస్తే షాక్ అవుతారు.
అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకునేందుకు.. మంగళగిరిలోని బాపిస్టపేటకు టీవీ9 నిఘా బృందం వెళ్ళింది. రెస్టారెంట్స్‌లో అమ్మేందుకు బీఫ్ కావాలని అడగడంతో.. అక్కడున్న వ్యాపారులు తామంటే తాము పంపిణీ చేస్తామని ముందుకు వచ్చారు. చాలా మంది తమ వద్ద బీఫ్ కొనుకోలు చేసి అందులో మటన్‌ను కలిపి మటన్ బిర్యానీ కింద అమ్మేస్తారాని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి విజయవాడ, చెన్నై , హైదరాబాద్ లాంటి మహానగరాలకు బీఫ్ సరఫరా అవుతోందని చెప్పుకొచ్చారు. అలా సరఫరా చేసిన బీఫ్‌ను పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మటన్ బిర్యానీలో కలిపి అమ్మేస్తుంటారని చెప్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో దుకాణంలో 150 కేజీల బీఫ్ మాంసాన్ని రెస్టారెంట్లకు అమ్మేస్తున్నారట.
మహానగరాల నుంచి వచ్చిన రెస్టారెంట్ వ్యాపారులు.. బీఫ్, ఆవు మాంసాన్ని కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. రెస్టారెంట్లలోని ధమ్ బిర్యానీలో కలిపి విక్రయించేందుకు తీసుకువెళ్తున్నారని బీఫ్ వ్యాపారులు చెప్తున్నారు. అయితే, అక్కడకు వెళ్లిన టీవీ9 నిఘా టీం తమకు కూడా అదే విధంగా మాంసం కావాలని చెప్పడంతో మటన్ బిర్యానీలో బీఫ్‌ను అనుమానం రాకుండా ఎలా కలపాలో కూడా వ్యాపారులే వివరించారు. బీఫ్ తినేవారు పెద్ద పెద్ద ముక్కలు తీసుకువెళ్తారని.. ఆలా కాకుండా మటన్‌లో కలిపేందుకు లేత దూడలు, ఆవుల నుండి తీసిన లేత మాంసాన్ని చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తామని అంటున్నారు. అలా చేస్తే మటన్ తినే వారికి అందులో బీఫ్ కలిపినట్టు అనుమానం రాదని చెప్పారు.
ఇదిలాఉంటే.. మటన్ పేరుతో విచ్చలవిడిగా జరుగుతున్న బీఫ్ అమ్మకాలపై అధికారుల నిఘా కరువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు.. ఇళ్ల మధ్యలోనే ఎలాంటి అనుమతులు లేకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో యథేచ్ఛగా బీఫ్ అమ్మకాలు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధికి పది దుకాణాల చప్పున ఏర్పాటు చేసి చనిపోయిన ఆవులు, గేదెల మాంసాన్ని కూడా విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు స్థానికులు. ఇది ఒక్క మంగళగిరి అనే కాకుండా మహానగరాలకు కూడా సరఫరా చేస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. అలా కొనుకోలు చేసిన బీఫ్‌ను తిన్న ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారు. మరి విచ్చలవిడిగా సాగుతున్న మాంసం దందాపై అధికారులు ఏం తీసుకుంటున్నారు? ఈ దందాను అరికట్టి ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతారో వేచి చూడాలి.
ఇక ఈ వ్యవహారంపై మంగళగిరి అడిషనల్ కమిషనర్ వివరణ కోరగా స్పందించారు. కల్తీ మాంసం అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని మంగళగిరి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ హేమామాలిని చెప్పారు. బీఫ్ అమ్మకాలకు నగరంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. బీఫ్ స్లాటర్ హౌస్‌లు పట్టణంలో లేవని, మటన్ స్లాటర్ హౌస్‌లు మాత్రమే ఉన్నాయన్నారు. కల్తీ మాంసం అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కల్తీ మాంసం అమ్మితే వారి లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. అనుమతులు ఉన్న దుకాణాల్లోనే మాంసం కొనుగోలు చేసుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు.
Also read:
PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసన తర్వాత మీరు ఇలా చేయండి.. లేకుంటే..
IPL 2021: మసకబారుతోన్న ధోని బ్యాట్.. మిస్టర్ కూల్ సరసన దారుణమైన రికార్డు.. అదేంటంటే..!