Chandrababu Arrest: లోకేష్ కుటుంబ సభ్యుల కోసం ఎంపీ భరత్ కాన్వాయ్ నిలిపివేసిన పోలీసులు..

Andhra Pradesh: భద్రత దృష్ట్యా మొదట ఎవరని ఆపాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు.... చివరికి ట్రాఫిక్ జామ్‌ అవ్వడంతో సెంట్రల్ జైలు ఎదురు రోడ్లోకి నారా లోకేష్ కాన్వాయ్‌ రావడంతో కాసేపు ఎంపీ భరత్ వెళుతున్న కాన్వాయ్ నిలిపివేశారు పోలీసులు.. జై చంద్రబాబు జై జై బాబు అంటూ ఎంపీ భరత్ కాన్వాయ్ ఎదుట నినాదాలు చేస్తూ వెళ్లారు టిడిపి శ్రేణులు.

Chandrababu Arrest: లోకేష్ కుటుంబ సభ్యుల కోసం ఎంపీ భరత్ కాన్వాయ్ నిలిపివేసిన పోలీసులు..
Mp Bharat Convoy

Updated on: Sep 12, 2023 | 8:26 PM

Andhra Pradeshతూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బయలుదేరుతున్న నారా కుటుంబ సభ్యుల కాన్వాయ్‌.. వెళుతున్న సమయంలో అటుగా వస్తున్న వైసిపి ఎంపీ భరత్ కాన్వాయ్‌ని ఆపేశారు పోలీసులు. కారులో నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కాన్వాయ్ వెళ్లిన తర్వాత ఎంపీ భరత్ కాన్వాయ్ నీ వదిలారు రాజమండ్రి పోలీసులు… భద్రత దృష్ట్యా మొదట ఎవరని ఆపాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకున్నారు..

చివరకు ట్రాఫిక్ జామ్‌ అవ్వడంతో సెంట్రల్ జైలు ఎదురు రోడ్లోకి నారా లోకేష్ కాన్వాయ్‌ రావడంతో కాసేపు ఎంపీ భరత్ వెళుతున్న కాన్వాయ్ నిలిపివేశారు పోలీసులు.. జై చంద్రబాబు జై జై బాబు అంటూ ఎంపీ భరత్ కాన్వాయ్ ఎదుట నినాదాలు చేస్తూ వెళ్లారు టిడిపి శ్రేణులు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..