AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా కమోడ్‌లో.. బాబోయ్..

విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోని ఓ ఇంటి వాష్‌రూమ్ కమోడ్‌లో ఉడుము కనిపించడం కలకలం రేపింది. తొలుత దానిని పాముగా భావించిన కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. గంటపాటు శ్రమించి ఉడుమును సురక్షితంగా రెస్క్యూ చేశారు. .. ..

Vizag: బాత్రూం నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా కమోడ్‌లో.. బాబోయ్..
Monitor Lizard
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 03, 2026 | 7:22 AM

Share

విశాఖలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్.. సెక్టార్-8లో ఓ ఇంట్లో కుటుంబం నివాసముంటోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఏదో అలికిడి విన్నారు. అటు ఇటు చూసారు.. ఎక్కడా ఏమీ లేదు. ఆ శబ్దం వాష్ రూం నుంచి వస్తున్నట్టు గుర్తించారు. డోర్ తీసి చూసారు. ఏమీ కనిపించలేదు. వాష్ రూం కమోడ్ లో ఓ లుక్కేశారు. దీంతో ఒక్కసారిగా గుండె గుభేల్ మంది. అందులో ఏదో ఉంది. కదులుతూ కనిపిస్తోంది. తోలుత పాము అనుకున్నారు. ముఖం చూసి కొండ చిలువ అని అనుమానించారు. కానీ కాస్త ఆకారం డిఫరెంట్ గా అనిపిస్తోంది. దగ్గరకు వెళ్ళేందుకు ధైర్యం చాలడం లేదు. దింతో డోర్ క్లోజ్ చేసి.. స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ కేచర్ కిరణ్.. వాష్ రూమ్ కమోడ్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే వందలాది పాములను రెస్క్యూ చేసి అనుభవం ఉన్న కిరణ్ .. ఆ కమోడ్‌లో ఉన్న దాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. అది పాము కాదు.. ఉడుము. దాన్ని పట్టుకునేందుకు తీవ్రంగానే శ్రమించారు స్నేక్ క్యాచర్. ఎందుకంటే ఉడుము పట్టు ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. దాన్ని విడిపించడం చాలా కష్టం. దీంతో భయం భయంగానే గంట పాటు శ్రమించి ఆ ఉడుమును చాకచక్యంగా రెస్క్యూ చేశాడు స్నేక్ క్యాచర్. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జీవవైవిద్యాన్ని పరిరక్షిస్తూ..

సాధారణంగా ఉడుము.. గ్రామాల దగ్గర, పొలాల గెట్ల వద్ద, రాళ్ల మధ్య లేదా చెట్ల పొదల్లో అప్పుడప్పుడు కనిపించే జీవి. ఉడుము ప్రకృతిలో కీలకమైన పాత్ర పోషించే సరీసృపం. ముఖ్యంగా దాని జీవన విధానం, గుడ్లు పెట్టే తీరు, పిల్లలను కాపాడే పద్ధతి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దేశంలో ఎక్కువగా కనిపించే ఉడుమును సాధారణంగా “బెంగాల్ మానిటర్ లిజర్డ్” అని పిలుస్తారు. ఇది వేగంగా పరిగెత్తగలదు. చెట్లెక్కగలదు. అవసరమైతే ఈదగలదు కూడా. చిన్న పాములు, ఎలుకలు, పురుగులు, పక్షుల గుడ్లు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. అందుకే పొలాల్లో హానికర జీవుల సంఖ్యను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది

వేసవిలో గుడ్లు పెట్టి..

ఉడుము సాధారణంగా వేసవి చివర్లో లేదా వర్షాకాలం ప్రారంభంలో గుడ్లు పెడుతుంది. ఒకేసారి 10 నుంచి 30 వరకు గుడ్లు పెట్టగలదు. ఈ గుడ్లను సాధారణంగా నేలలో గుంత తవ్వి దాచిపెడుతుంది. కొన్ని జాతుల ఉడుములు చెదపురుగుల గుట్టల్లో కూడా గుడ్లు పెడతాయి. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటంతో గుడ్లు సురక్షితంగా పెరుగుతాయి. సాధారణంగా 6 నుంచి 9 నెలల తర్వాత వాటి నుంచి పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలు పుట్టిన వెంటనే తమ ఆహారం తామే వెతుక్కుంటాయి.

తోకతో కూడా దాడి చేయగలదు..

ఉడుము నాలుక పాముల మాదిరిగా రెండుగా చీలి ఉంటుంది. దీని ద్వారా వాసనలను బాగా గుర్తిస్తుంది. ప్రమాదం అనిపిస్తే బలమైన తోకతో దాడి చేయగలదు. కొన్ని ఉడుములు 5 నుంచి 6 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి .ఇవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు. కానీ రెచ్చగొడితే మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు. చాలామంది అపోహలతో ఉడుములను చంపేస్తుంటారు. కానీ ఇవి పంటలను నాశనం చేసే ఎలుకలు, పురుగులను తిని రైతులకు మేలు చేస్తాయి. ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో ఉడుముల పాత్ర ఎంతో ముఖ్యమైనది.

వన్యప్రాణి చట్టం జాబితాలో..

భారతదేశంలో ఉడుము – మానిటర్ లిజర్డ్ వేట పూర్తిగా నిషేధం. ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షిత జంతువుల జాబితాలో ఉన్నాయి. ఉడుమును పట్టడం, చంపడం, గుడ్లు సేకరించడం, మాంసం లేదా చర్మం కోసం వేటాడటాన్ని నేరంగా పరిగణిస్తారు. భారతదేశంలో అమలులో ఉన్న వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఉడుములు రక్షిత జంతువులు. ఉడుము వేట లేదా అక్రమ రవాణా నిరూపితమైతే 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. భారీ జరిమానాలు కూడా విధిస్తారు.

Follow Us
బాత్రూం కమోడ్‌లో ఏముందో చూస్తే బిత్తరపోవాల్సిందే..
బాత్రూం కమోడ్‌లో ఏముందో చూస్తే బిత్తరపోవాల్సిందే..
ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
ఇక వెండి కొనడం అంత సులభం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే: అశ్విన్
ఆ అవార్డు వైభవ్‌ది కాదు.. అసలైన అర్హుడు ఆయనే: అశ్విన్
ఇంట్లోనే 5-స్టార్ హోటల్ స్టైల్ టీ..ఈ చిన్న చిట్కాలతో రూ.1000 రుచి
ఇంట్లోనే 5-స్టార్ హోటల్ స్టైల్ టీ..ఈ చిన్న చిట్కాలతో రూ.1000 రుచి
బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!
బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. ఇప్పుడు తులం ధర ఎంత ఉందంటే..!
ఇలాంటి వాళ్ళు డేంజర్.. మనుషుల అసలు స్వభావం ఇలా తెలుసుకోండి
ఇలాంటి వాళ్ళు డేంజర్.. మనుషుల అసలు స్వభావం ఇలా తెలుసుకోండి
రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి.. బాడీని కూల్ చేసే వడలు
రెండు నిముషాల్లో కడుపును క్లీన్ చేసి.. బాడీని కూల్ చేసే వడలు
జూన్ 3 రాశిఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు వచ్చే ఛాన్స్..
జూన్ 3 రాశిఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు వచ్చే ఛాన్స్..
మహేష్, చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్, చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?
క్యాసర్ తో పోరాడి గెలిచిన ఈ అందాల భామ గుర్తుందా.?