AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రాష్ట్ర ఐసెట్‌ కౌన్సెలింగ్‌ 2026 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు జరగనుంది..

నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
AP ICET Counselling Registration
Srilakshmi C
|

Updated on: Aug 25, 2026 | 3:12 PM

Share

అమరావతి, ఆగస్ట్ 25: రాష్ట్రంలో పలు కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు కొనసాగనుంది. ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్లను పరిశీలనకు సమర్పించాలి. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి. నమోదు చేసిన వెబ్‌ ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 3 వరకు అవకాశం కల్పించారు.

సెప్టెంబర్‌ 7న సీట్ల కేటాయింపు

అభ్యర్థులు నమోదు చేసిన వెబ్‌ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్‌ 7న సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు కేటాయించిన కళాశాలలో నిర్ణీత గడువులోగా చేరాల్సి ఉంటుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన తరగతులు సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. సీట్ల కేటాయింపు అనంతరం అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలలో చేరి తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తప్పనిసరిగా గమనించి, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

AP ICET 2026 కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

AP ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌ ముఖ్య తేదీలు ఇవే..

  • రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్ల అప్‌లోడ్‌, ఫీజు చెల్లింపు తేదీలు: ఆగస్టు 24 నుంచి 31 వరకు
  • సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు: ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 1 వరకు
  • వెబ్‌ ఆప్షన్ల నమోదు తేదీలు: ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 2 వరకు
  • వెబ్‌ ఆప్షన్లలో మార్పు తేదీ: సెప్టెంబరు 3
  • సీట్ల కేటాయింపు తేదీ: సెప్టెంబరు 7
  • కాలేజీల్లో రిపోర్టింగ్‌ తేదీలు: సెప్టెంబరు 8 నుంచి 11 వరకు

AP ICET 2026 కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us