AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ స్పెషల్‌ TET 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. DSC అభ్యర్ధులు దరఖాస్తు చేయొచ్చా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌-సర్వీస్‌ టీచర్లకు కూటమి సర్కార్ తీపి కబురు అందించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 24న స్పెషల్‌ టెట్‌ (Special TET) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ, స్థానిక బడులు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ (X) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు..

ఏపీ స్పెషల్‌ TET 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. DSC అభ్యర్ధులు దరఖాస్తు చేయొచ్చా?
AP Special TET Notification
Srilakshmi C
|

Updated on: Aug 25, 2026 | 3:46 PM

Share

అమరావతి, ఆగస్ట్ 25: ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ టెట్‌ 2026కు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25, 2026వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అర్హత కలిగిన ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయులు సెప్టెంబర్‌ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. దరఖాస్తులను ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలి.

స్పెషల్‌ టెట్‌ పరీక్షలను అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌ 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్‌ 5 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 24న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 1 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్‌ 10న తుది కీ, నవంబర్‌ 15న తుది ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా ప్రత్యేక టెట్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌, మార్గదర్శకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, తమ అర్హతను నిర్ధారించుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు ఇవే

  • ఏపీ స్పెషల్ టెట్ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఆగస్టు 25, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 24, 2026.
  • స్పెషల్‌ టెట్‌ పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు

ఏపీ స్పెషల్ టెట్ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీ ప్రభుత్వం స్పెషల్ టెట్ 2026 ఎందుకు నిర్వహిస్తుందంటే?

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2011కు ముందు ప్రభుత్వ బడుల్లో టీచర్లుగా నియమితులైన అర్హత కలిగిన ఇన్‌-సర్వీస్‌ టీచర్లు టెట్‌ అర్హత సాధించేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకుఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక టెట్‌ ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు నిర్దేశిత గడువులో టెట్‌ అర్హత సాధించే అవకాశం కల్పిస్తున్నారు. అర్హత, పేపర్ల ఎంపిక, దరఖాస్తు విధానం, పరీక్ష సిలబస్‌ తదితర పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌లో పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

Follow Us
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస..
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?
ఒకే ఓవర్లో 2 వికెట్లతో చెలరేగిన బుడ్డోడు.. సెలబ్రేషన్స్ చూశారా..?