Konaseema: పూలే విగ్రహం తొలగింపు.. వైసీపీ ఎమ్మెల్సీపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్‌.. అసలేం జరిగిందంటే..?

ఏపీలో పూలే విగ్రహం తొలగింపు వివాదం ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా మారింది. ఇప్పటికే ఉన్న వివాదాలు చాలవన్నట్టు మరో కొత్త వివాదం వచ్చి చేరడంతో.. రాజకీయం మరింత రంజుగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేసింది.

Konaseema: పూలే విగ్రహం తొలగింపు.. వైసీపీ ఎమ్మెల్సీపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్‌.. అసలేం జరిగిందంటే..?
Konaseema Politics

Updated on: Apr 12, 2023 | 7:45 AM

ఏపీలో పూలే విగ్రహం తొలగింపు వివాదం ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా మారింది. ఇప్పటికే ఉన్న వివాదాలు చాలవన్నట్టు మరో కొత్త వివాదం వచ్చి చేరడంతో.. రాజకీయం మరింత రంజుగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేసింది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుముడిలో జ్యోతిరావ్ పూలే విగ్రహం తొలగింపు వివాదం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. జ్యోతిరావ్ పులే జయంతి సందర్భంగా గ్రామానికి చెందిన బీసీలు విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం పెట్టిన స్థలం పంచాయితీదని.. వెంటనే విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించాలని పంచాయితీ సిబ్బంది ఆదేశించింది.

దీంతో గ్రామస్తులకు పంచాయతీ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. పంచాయితీ సిబ్బంది.. విగ్రహాన్ని కార్యాలయంకి తరలించి.. ధ్వంసం చేయడంతో వివాదం మరింత ముదిరింది. జ్యోతీరావ్ ఫులే విగ్రహం తొలగింపుపై స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సీరియస్‌ అయ్యారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై నిప్పులు చెరిగారు. విగ్రహం ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టాలని డిమాండ్‌ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా బీసీ సోదరులతో కలిసి విగ్రహం కోసం ఎంత దూరమైన వెళ్తానని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పులే విగ్రహం తొలగింపును రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు.

మొత్తంగా పూలే విగ్రహం తొలగింపు వివాదాలకు దారితీసింది. విగ్రహం చూట్టు రాజకీయం అల్లుకుంది. చూడాలి ఈ మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..