Andhra Pradesh: నెల్లూరులో తొడగొడుతున్న రాజకీయం.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ప్రెస్ మీట్..

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ట్యాపింగ్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల నుంచి రోజుకో ట్విస్ట్ తో, చల్లారని ఆవేశంతో మీడియా ముందుకు వస్తున్న కోటంరెడ్డి..

Andhra Pradesh: నెల్లూరులో తొడగొడుతున్న రాజకీయం.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ప్రెస్ మీట్..
Nellore Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2023 | 10:30 AM

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ట్యాపింగ్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల నుంచి రోజుకో ట్విస్ట్ తో, చల్లారని ఆవేశంతో మీడియా ముందుకు వస్తున్న కోటంరెడ్డి.. ఇవాళ కూడా ఆగ్రహంగానే మాట్లాడబోతున్నారా..? రోజుకో ఆడియో వినిపిస్తున్న ఆయన ఇవాళ కూడా కొత్త సెన్సేషన్‌ ఏమైనా తీసుకురాబోతున్నారా? లేదంటే విమర్శలకు, ఆరోపణలకు కౌంటర్ ఇస్తారా? ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడే తీరును బట్టి ఆ విషయం చూద్దాం. కానీ.. కోటంరెడ్డి కేంద్రంగా నిన్న జరిగిన రెండు పరిణామాలు ఓసారి చూద్దాం.. వాటిల్లో ఒకటి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పెట్టిన కేసులు. ఆయన ఆవేశంగా మాట్లాడిన తర్వాత సిటీలోని ఓ కార్పోరేటర్ విజయ్‌.. తన ఆఫీస్‌లోని కోటంరెడ్డి ఫ్లెక్సీలను తొలగించారు. ఆ విషయం తెలిసి కోటంరెడ్డి, తనకు ఫోన్‌ చేసి అంతుచూస్తానని బెదిరించినట్లు విజయ్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఇంటికొచ్చి మరీ వార్నింగ్‌లు ఇచ్చారని చెబుతున్నారు విజయ్‌. చంపినా ఫర్వాలేదుగానీ జగన్‌ వెంటే ఉంటానంటూ ఆ తర్వాత విజయ్‌, కోటంరెడ్డిపై ఫైర్ అయ్యారు.

మరోవైపు ఇదే నెల్లూరు రగడలో మరోకాల్ రచ్చగా మారింది. ఓ వ్యక్తి కోటంరెడ్డికి ఫోన్ చేసి జగన్‌కి క్షమాపణ చెప్పమని అడిగారు. లేదంటే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించినట్లు ఆ ఆడియోలో విపిస్తోంది.

మొత్తంగా ఫోన ట్యాపింగ్‌తో మొదలైన ఆరోపణలు.. వివాదంగా మారాయి. కేసుల దాకా వెళ్లాయి. తొడలు కొట్టేవరకూ వచ్చాయి. వీటిపైనే ఇవాళ కోటంరెడ్డి మళ్లీ మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..