Kotamreddy Sridhar Reddy: జగన్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన నిర్ణయం..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు గన్‌మెన్లను తొలగించగా.. మరో ఇద్దరు కూడా తనకు వద్దంటూ పంపించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు గన్‌మెన్లను తొలగించగా.. మరో ఇద్దరు కూడా తనకు వద్దంటూ పంపించారు. తాను వైసీపీకి దూరం అవుతున్నట్లు ప్రకటించిప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఈ సమయంలో భద్రత పెంచాల్సిన ప్రభుత్వం తొలగించడమేంటని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. తనను మానసికంగా భయపెట్టాలని చూస్తున్నారు. నేనేం భయపడను.. మద్దతుదారులే రక్షణ ఉంటారని ప్రకటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై చేసిన ట్యాపింగ్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల నుంచి రోజుకో ట్విస్ట్ తో, చల్లారని ఆవేశంతో మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ప్రభుత్వం తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో నాలుగు రోజుల నుంచి ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. దీంతో ప్రభుత్వం కోటంరెడ్డి భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తనకు ఇప్పటి వరకు 2 ప్లస్ 2 సెక్యురిటీ ఉండగా ప్రభుత్వం.. ఇద్దరు గన్‌మేన్లను తొలగించి 1ప్లస్ 1కి మార్చిందని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మిగిలిన ఇద్దరు గన్‌మేన్లు కూడా తనకు అక్కర్లేదని.. తిరస్కరిస్తున్నానంటూ తెలిపారు. భద్రతా సమస్యలు ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉన్న భద్రతను తగ్గించడమేంటంటూ ప్రశ్నించారు.
ఇద్దరు గన్‌మేన్లను తొలగించి ప్రభుత్వం తనకు ఓ గిఫ్ట్ ఇచ్చిందని.. తాను మిగిలిన ఇద్దర్ని కూడా తొలగించి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన మద్దతుదారులు, ప్రజలే తనకు రక్షణగా ఉంటారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాణిని కొనసాగిస్తానని.. ఇకనుంచి తగ్గబోనంటూ స్పష్టంచేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..