Andhra News: రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. ఎందుకో తెలుసా?

ఏపీ ప్రజలకు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ శుభవార్త చెప్పారు. అమరావతిలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిపారు. ఈ నెల13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా హాస్పిటల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. అమరావతిలో హాస్పిటల్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra News: రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. ఎందుకో తెలుసా?
Balakrishna

Edited By: Anand T

Updated on: Aug 02, 2025 | 6:02 PM

ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి ముందడుగు పడింది. రాష్ట్రంలో ఆహాస్పిటల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసినట్టు నటుడు బాలకృష్ణ తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం.. అనంతవరంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల భూమిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఈ నెల 13న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమాకి ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ అవార్డు రావడం గర్వకారణమని చెప్పారు. మహిళా సాధికారతపై బలమైన సందేశం ఇచ్చే చిత్రంగా భగవంత్ కేసరి నిలిచిందని పేర్కొన్నారు. ‘‘సినిమాలు అయినా, ఆస్పత్రులు అయినా.. ప్రజల్లో చైతన్యం కలిగించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.

బసవతారకం ఆస్పత్రి దేశస్థాయిలో గుర్తింపు పొందింది

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి దేశంలోనే టాప్ 3,4 హాస్పిటళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అక్కడ అవలంబించే చికిత్సా విధానాలు ఇప్పుడు జాతీయస్థాయిలో అనుసరించబడుతున్నాయి. అమరావతిలో కూడా అదే స్థాయిలో ఆస్పత్రిని నిర్మించబోతున్నాం. వీలైనంత త్వరగా అమరావతిలో నిర్మాణం ప్రారంభిస్తాంఅని బాలకృష్ణ తెలిపారు.

వీడిచె చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.